
(1 / 8)

(2 / 8)
వైజాగ్, అరకు అందాలను చూసేందుకు ఐఆర్ సీటీసీ టూరిజం తాజాగ్ కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. “JEWEL OF EAST COAST” పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

(3 / 8)
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 12 మార్చి. 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. సంబంధిత తేదీల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడాల్సి ఉంటుంది.
(image source AP Tourism)
(4 / 8)
ఈ ప్యాకేజీ మొత్తం ఐదు రోజులు ఉంటుంది. మొదటి రోజు హైదరాబాద్ రైల్వే స్టేషన్(Train No. 12728 ) నుంచి సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరుతారు. ఉదయం 5.55 కు విశాఖకు చేరుతారు. హోటల్ లో కి చెకిన్ అయిన తర్వాత… బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. నేరుగా కాళీ మాతా దర్శనం, సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి, రుషికొండ బీచ్ చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
(Twitter)
(5 / 8)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వైజాగ్ నుంచి అరకు వెళ్తారు. Tyda జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్ చూస్తారు. ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత…. గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు. రాత్రి తిరిగి వైజాగ్ కు చేరుకుంటారు,

(6 / 8)
నాల్గో రోజు ఉదయం సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఆర్కే బీచ్ కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు వైజాగ్ లో రిటర్న్ జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీలోనే ఉంటారు. ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.

(7 / 8)
సింగిల్ షేరింగ్ కు రూ. 27910, డబుల్ షేరింగ్ రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా ఉంది. ఈ ధరలు కంఫర్ట్ 3ఏ క్లాస్ లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480, డబుల్ షేరింగ్ కు రూ. 15,110గా నిర్ణయించారు.

(8 / 8)
ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.
(image source IRCTC Tourism)ఇతర గ్యాలరీలు