తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Shirdi Tour : హైదరాబాద్ టు షిర్డీ టూర్ ప్యాకేజీ - ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్ కూడా చూడొచ్చు, ఈనెలలోనే ట్రిప్
- IRCTC Hyderabad Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీకి మరో కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తోంది. సాయిబాబా దర్శనంతో పాటు ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్ కూడా చూడొచ్చు. టికెట్ ధరలు, టూర్ షెడ్యూల్ వివరాలను పూర్తి కథనంలో చూడండి….
- IRCTC Hyderabad Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీకి మరో కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తోంది. సాయిబాబా దర్శనంతో పాటు ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్ కూడా చూడొచ్చు. టికెట్ ధరలు, టూర్ షెడ్యూల్ వివరాలను పూర్తి కథనంలో చూడండి….
(1 / 8)
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే షిర్డీని చూసేందుకు పలు ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ… తాజాగా కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.(image from @SSSTShirdi 'X' Account)
(2 / 8)
హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో కూడిన ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'SHIRDI WITH AURANGABAD' పేరుతో డిస్ ప్లే అవుతుంది. (image from @SSSTShirdi 'X' Account)
(3 / 8)
టూర్ షెడ్యూల్ చూస్తే… మొదటి రోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత శనిశిగ్నాపూర్ కు వెళ్తారు.(image from @SSSTShirdi 'X' Account)
(4 / 8)
ఇక మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. మినీ తాజ్ మహల్ (Bibi Ka Maqbara) ను దర్శించుకుంటారు. ఇక్కడ్నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఎల్లోరా గుహాలను చూసేందుకు వెళ్తారు. ఇక్కడ ఎల్లోరా కేవ్స్, గ్రిహీనేశ్వర్ ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆ తర్వాత….ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. (image from @SSSTShirdi 'X' Account)
(5 / 8)
ఇక నాల్గో రోజు మార్నింగ్ 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.(image from @SSSTShirdi 'X' Account)
(6 / 8)
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 23,740గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 13,070 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 10,320 ఉంది. Comfort 3ఏ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. Standard క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 8830గా నిర్ణయించారు. (image from @SSSTShirdi 'X' Account)
(7 / 8)
ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు(image from @SSSTShirdi 'X' Account)
ఇతర గ్యాలరీలు