(1 / 7)
(2 / 7)
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ అక్టోబరు 25, 2023వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు
(https://unsplash.com)(3 / 7)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్ train no. 17064) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
(https://unsplash.com)(4 / 7)
రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు.
(https://unsplash.com)(5 / 7)
సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు
(IRCTC)(6 / 7)
మూడో రోజు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది, హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు 13100 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 8020 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6390గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 11410, డబుల్ షేరింగ్ కు 6330గా నిర్ణయించారు. గత నెలలో ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉండగా… తగ్గంచారు.
(https://unsplash.com)(7 / 7)
ఈ టూర్ ప్యాకేజీలోటికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
(unsplash.com)ఇతర గ్యాలరీలు