IRCTC Shirdi Tour : షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ - ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్ కూడా చూడొచ్చు! ఇవిగో వివరాలు
- IRCTC Hyderabad Shirdi Tour: షిర్డీకి ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. SHIRDI WITH AURANGABAD పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి……. 09-AUG-24
- IRCTC Hyderabad Shirdi Tour: షిర్డీకి ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. SHIRDI WITH AURANGABAD పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి……. 09-AUG-24
(1 / 6)
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయి ఇప్పటికే షిర్డీని చూసేందుకు పలు ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ… తాజాగా కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.(image source unsplash.com)
(2 / 6)
' SHIRDI WITH AURANGABAD' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు,. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో కూడిన ప్యాకేజీ ఇది. (image source unsplash.com)
(3 / 6)
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత శనిశిగ్నాపూర్ కు వెళ్తారు.(image source IRCTC Tourism)
(4 / 6)
ఇక మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. మినీ తాజ్ మహల్ (Bibi Ka Maqbara) ను దర్శించుకుంటారు. ఇక్కడ్నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఎల్లోరా గుహాలను చూసేందుకు వెళ్తారు. ఇక్కడ ఎల్లోరా కేవ్స్, Grishneshwar ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆ తర్వాత….ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. (image source unsplash.com)
(5 / 6)
నాల్గోరోజు ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.(image source unsplash.com)
(6 / 6)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 21200గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 11070ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 8490ఉంది. స్టాండర్డ్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు(image source twitter)
ఇతర గ్యాలరీలు