
(1 / 7)
మంచు కురిసే వేళలో కేరళలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

(2 / 7)
ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 12, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

(3 / 7)
హైదరాబాద్ - కేరళ ట్రిప్ లో భాగంగా… మున్నార్ , అలెప్పీతో పాటు పలు మరికొన్ని అద్భుతమైన టూరిజం స్పాట్లు చూడొచ్చు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. 2వ రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.
(image source from unsplash.com)
(4 / 7)
3వ రోజు ఉదయంt Eravikulam National Parkను సందర్శిస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు. నాల్గో రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(image source from unsplash.com)
(5 / 7)
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 34480గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19910ధరగా ప్రకటించారు. గత నెలలో ఇదే ప్యాకేజీ ధర రూ. 16260గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.13530గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 17180గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 31750గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
(image source from unsplash.com)
(6 / 7)
ఈ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
(image source from unsplash.com)
(7 / 7)
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092
(image source from unsplash.com)ఇతర గ్యాలరీలు