(1 / 9)
వేసవి వేళ ఎండల దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో గోవాకు వెళ్లి చిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అయితే అలాంటి వారి కోసం IRCTC టూరిజం కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
(image source pixabay)(2 / 9)
హైదరాబాద్ సిటీ నుంచి గోవా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది.
(image source pixabay)(3 / 9)
హైదరాబాద్ నుంచి గోవాకు ఆపరేట్ చేసే ఈ టూర్ ప్యాకేజీ …. ప్రస్తుతం మే 28, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. అయితే ఈ వివరాలు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో అప్డేట్ అవుతాయి.
(image source pixabay)(4 / 9)
మొత్తం 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. నేరుగా గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. Zuari నది అందాలను వీక్షిస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
(image source pixabay)(5 / 9)
టూర్ ప్యాకేజీలో భాగంగా…. 2వ రోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , వాక్స్ వరల్డ్ మ్యూజియం, మంగేషి ఆలయం, మీరామర్ బీచ్ వెళ్తారు. మండోవి నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది.
(image source pixabay)(6 / 9)
మూడో రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ లను చూస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.
(image source pixabay)(7 / 9)
చివరి రోజు బ్రేక్ ఫాస్టే చేసిన తర్వాత.. హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నేరుగా గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.
(image source pixabay)(8 / 9)
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ అక్యుపెన్సీకి రూ. 25, 210గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19,420, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18,860గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
(image source pixabay)(9 / 9)
ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. ఐఆర్ సీటీసీ టూరిజం నిబంధనలకు అనుగుణంగా టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.
(image source pixabay)ఇతర గ్యాలరీలు