IRCTC Tour Package : సిమ్లా, అమృత్ సర్, ధర్మశాల ట్రిప్ - తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
- IRCTC Tourism Hyderabad Himachal Tour 2024 : హిమాచల్ ప్రదేశ్ తో పాటు పంజాబీలోని పలు ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
- IRCTC Tourism Hyderabad Himachal Tour 2024 : హిమాచల్ ప్రదేశ్ తో పాటు పంజాబీలోని పలు ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
(1 / 7)
చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.(unsplash.com)
(2 / 7)
తాజాగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. HAPPY HIMACHAL & POPULAR PUNJABపేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.(unsplash.com)
(4 / 7)
ఇది 8 రోజులు, 7 రాత్రుల ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 283, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఫ్లైట్ జర్నీ ద్వారా టూర్ ఆపరేట్ ఉంటుంది.(IRCTC)
(5 / 7)
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఛండీఘర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి సిమ్లాకు వెళ్లారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్ర మల్లా రోడ్ ను సందర్శిస్తారు. రాత్రి సిమ్లానే బస చేస్తారు.(unsplash.com)
(6 / 7)
ఆ తర్వాత ధర్మశాల, దాల్ హౌసికి వెళ్తారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తారు. ఆ తర్వాత అమృత్ సర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి ఛండీఘడ్ కు చేరుకుంటారు. 8వ రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు బయల్దేరుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)
(7 / 7)
ఈ టూర్ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 61300గా ఉంటుంది. ఇక డబుల్ ఆక్యుపెన్సికీ రూ.47250, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 44750గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టూర్ బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు.(unsplash.com)
ఇతర గ్యాలరీలు