IRCTC Goa Tour : హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్... తక్కువ ధరకే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
- IRCTC Hyderabad - Goa Tour : గోవాకి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. నవంబరు 1వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
- IRCTC Hyderabad - Goa Tour : గోవాకి మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. నవంబరు 1వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
(1 / 7)
గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(https://unsplash.com)(2 / 7)
ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చూస్తే ప్రస్తుతం నవంబరు 1, 2023వ తేదీన అందుబాటులో ఉంది. 4 రోజులు, 3 రాత్రుల ప్యాకేజీ ఇది.
(https://unsplash.com)(3 / 7)
మొదటిరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
(4 / 7)
రెండో రోజు బ్రేక్ ఫాస్ తర్వాత.. సౌత్ గోవాకు వెళ్తారు. ఓల్డ్ గోవా చర్చ ను సందర్శిస్తారు. వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే బస చేస్తారు.
(5 / 7)
మూడో రోజు నార్త్ గోవాలో పర్యటిస్తారు. కండోలియం బీచ్, బాగా బీచ్ కు వెళ్తారు. చపోరా ఫోర్ట్ ను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. నాల్గోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో జర్నీ ముగుస్తుంది.
(6 / 7)
ఈ గోవా రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 27,560 ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21,930గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.21,805గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
(https://unsplash.com)(7 / 7)
ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. టూర్ ప్యాకేజీని బుక్ కూడా చేసుకోవచ్చు. ఇతర సందేహాలు ఉంటే 040-27702407 / 9701360701 ఫోన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.
ఇతర గ్యాలరీలు