తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Kartika Masam Special: కార్తీక మాసం స్పెషల్, 7 పుణ్య క్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ
IRCTC Kartika Masam Special : కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది.
(1 / 6)
కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ అందిస్తుంది.
(2 / 6)
9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను చేయవచ్చు. సికింద్రాబాద్ నుంచి 2AC, 3AC & SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఐఆర్సీటీసీ నడుపుతోంది. తదుపరి టూర్ నవంబర్ 6 నుంచి 14 వరకు కొనసాగనుంది.
(3 / 6)
పర్యాటన ముఖ్యాంశాలు -పర్యటన పేరు: జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర (కార్తీక మాసం ప్రత్యేకం) - టూర్ వ్యవధి : 8 రాత్రులు/9 రోజులు-పర్యటన తేదీ : 06.11.2024
(4 / 6)
-పర్యటన ఇలా : తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం - మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు-సీట్ల సంఖ్య : 578 (SL: 320, 3AC: 206, 2AC: 50)
(5 / 6)
భారత్ గౌరవ్ ట్రైన్ బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట
(6 / 6)
టూర్ ధర -ఎకానమీ(SL) - పెద్దలకు - రూ 14,250, పిల్లలకు - రూ 13,250స్టాండర్ట్(3AC)- పెద్దలకు -రూ. 21,900, పిల్లలకు -రూ. 20,700కంఫర్ట్ (2AC)- పెద్దలకు -రూ. 28,450, పిల్లలకు - రూ. 27,010ఈ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG30 ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇతర గ్యాలరీలు