IRCTC Araku Tour : ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసొద్దామా? రూ.2055 కే ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్డు టూర్ ప్యాకేజీ-irctc araku tour package from visakhapatnam rail cum road one day tour details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Araku Tour : ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసొద్దామా? రూ.2055 కే ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్డు టూర్ ప్యాకేజీ

IRCTC Araku Tour : ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసొద్దామా? రూ.2055 కే ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్డు టూర్ ప్యాకేజీ

Jan 28, 2025, 04:33 PM IST Bandaru Satyaprasad
Jan 28, 2025, 04:33 PM , IST

IRCTC Araku Tour : అరకు అందాలు చూసేందుకు అతితక్కువ ధరలో ఐఆర్సీటీసీ చక్కటి ప్యాకేజీ అందిస్తోంది. అరకు...వ్యాలీ, జలపాతాలు, ప్రవాహాలు, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 2,055. ప్రతీరోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసేందుకు అతితక్కువ ధరలో ఐఆర్సీటీసీ చక్కటి ప్యాకేజీ అందిస్తోంది. అరకు లోయ..జలపాతాలు, ప్రవాహాలు, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్.  పోర్టు సిటీ విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీకి రైల్ కమ్ రోడ్డు వన్ డే టూర్ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్సీటీసీ.  

(1 / 6)

విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్డు టూర్ లో అరకు వ్యాలీ, గిరిజన మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం, అనంతగిరి కాఫీ తోటలు,  గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు వీక్షించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 2,055. ప్రతీరోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 

(2 / 6)

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి  రైలు(నెం. 58501)లో అరకు లోయకు బయలుదేరతారు. ప్రతి రోజు ఉదయం 06.45 గంటలకు రైలు బయలుదేరుతుంది. సొరంగాలు, వంతెనలు, ప్రకృతి దృశ్యాలను రైలు ప్రయాణంలో ఆస్వాదించవచ్చు. ఉదయం 10.55 గంటలకు అరకు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 

(3 / 6)

అరకు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ముందుగా ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం చేసి రోడ్డు మార్గంలో తిరిగి వైజాగ్‌కు బయలుదేరతారు. 

(4 / 6)

వైజాగ్ చేరుకునే మార్గంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు.  

(5 / 6)

 ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు ఈ నెంబర్లను 7670908160, 9281030739 సంప్రదించవచ్చు. అలాగే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 లో బుక్ చేసుకోవచ్చు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు