IRCTC Andaman Tour 2025: హైదరాబాద్ టు అండమాన్..! ఫిబ్రవరి నెలలో ట్రిప్, ఈ కొత్త ప్యాకేజీపై ఓ లుక్కేయండి
- IRCTC Hyderabad Andaman Tour 2025: అందమైన అండమాన్ దీవుల్లో విహరించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందమైన బీచ్‌లతో పాటు ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను తక్కువ ధరలోనే చూపించనుంది. ఫిబ్రవరి నెలలో ట్రిప్ ఉండనుంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…
- IRCTC Hyderabad Andaman Tour 2025: అందమైన అండమాన్ దీవుల్లో విహరించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందమైన బీచ్‌లతో పాటు ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను తక్కువ ధరలోనే చూపించనుంది. ఫిబ్రవరి నెలలో ట్రిప్ ఉండనుంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి…
(1 / 8)
అందమైన అండమాన్ దీవులను చూసే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్ సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెలలో కొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(image source from pexels )(2 / 8)
తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే అండమాన్ దీవులను చూడాల్సిందే..! ఇందుకోసం "AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)' పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(image source from pexels )(3 / 8)
ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 12,2025వ తేదీన అందుబాటులో ఉంది. https://www.irctctourism.com/
వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
(image source from pexels )(4 / 8)
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 06:35 AM ఫ్లైట్ బయల్దేరుతుంది. ఉదయం 08:55 గంటలకు పోర్ట్ బ్లెయిర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. సెల్యూలర్ జైల్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత Corbyns Cove Beachకు వెళ్తారు. ఆ తర్వాత సెల్యూలర్ జైలు వద్ద లైడ్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు. రాత్రి పోర్ట్ బ్లెయిర్ లోనే ఉంటారు.
(image source from pexels )(5 / 8)
రెండో రోజు Havelock వెళ్తారు. రాధానగర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి Havelockలోనే ఉంటారు. మూడో రోజు కాళా పతర్ బీచ్ కు వెళ్తారు. అక్కడ్నుంచి నీల్ ఐల్యాండ్ ను సందర్శిస్తారు, సాయంక్రం సితాపుర్ బీచ్ , లక్ష్మణ్ పుర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి ఇక్కడే ఉంటారు. నాల్గో రోజు భరత్ నగర్ బీచ్ కు వెళ్తారు. ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ కు చేరుకంటారు.
(image source from pexels )(6 / 8)
5వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత రోస్ ఐల్యాండ్ వెళ్తారు. ఆ తర్వాత నార్త్ బే ఐల్యాండ్ చూస్తారు. ఇక్కడ కొన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత సముద్రిక మెరైన్ మ్యూజియం చేస్తారు., రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లో నే ఉంటారు. ఆరో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి బయల్దేరారు. రాత్రి 12.10 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.
(image source from pexels )(7 / 8)
హైదరాబాద్ - అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.68320గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.51600 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.49960గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.
(image source from pexels )(8 / 8)
హైదరాబాద్ - అండమాన్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA18
(image source from pexels )ఇతర గ్యాలరీలు