Hyderabad Irani chai : హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఇంత పెద్ద చరిత్ర ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!-irani chai available in hyderabad has a surprising history ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Irani Chai : హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఇంత పెద్ద చరిత్ర ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Hyderabad Irani chai : హైదరాబాద్ ఇరానీ చాయ్‌కి ఇంత పెద్ద చరిత్ర ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Jan 04, 2025, 11:35 AM IST Basani Shiva Kumar
Jan 04, 2025, 11:35 AM , IST

  • Hyderabad Irani chai : హైదరాబాద్.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇరానీ చాయ్. అవును అంత ఫేమస్ మరి. అయితే.. ఈ ఇరానీ చాయ్‌కి పెద్ద చరిత్రే ఉంది. తాజాగా ఇరానీ చాయ్ స్టాల్‌ను నుమాయిష్‌లోనూ ఏర్పాటు చేశారు. దీంతో దీని గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్‌లో టీ లవర్స్ చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా.. ఇరానీ చాయ్‌కి ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. కేఫ్ నీలోఫర్‌లో లభించే ఇరానీ చాయ్.. ఇప్పుడు హైదరాబాద్‌లోని నుమాయిష్‌లోనూ అందుబాటులో ఉంది. నాంపల్లిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి నీలోఫర్ కేఫ్‌ను నుమాయిష్ 2025కి ఆహ్వానించారు.

(1 / 6)

హైదరాబాద్‌లో టీ లవర్స్ చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా.. ఇరానీ చాయ్‌కి ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. కేఫ్ నీలోఫర్‌లో లభించే ఇరానీ చాయ్.. ఇప్పుడు హైదరాబాద్‌లోని నుమాయిష్‌లోనూ అందుబాటులో ఉంది. నాంపల్లిలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి నీలోఫర్ కేఫ్‌ను నుమాయిష్ 2025కి ఆహ్వానించారు.(istockphoto)

లక్డికాపుల్‌లోని కేఫ్ నీలోఫర్‌లో ఒక కప్పు ఇరానీ చాయ్‌ రూ.35 ఉంటుంది. బంజారాహిల్స్‌లో ఒక కప్పు ధర రూ.100. 1/2 కప్పు ఇరానీ చాయ్ ధర రూ.120 ఉంటుంది. ధర ఇంత ఉన్నా.. చాలామంది ఇరానీ చాయ్‌నే తాగడానికి ఇష్టపడతారు. కేఫ్ నీలోఫర్‌లో ఇరానీ చాయ్‌తో పాటు.. బన్ మస్కా, మలై బన్‌లు కూడా చాలా ఫేమస్. 

(2 / 6)

లక్డికాపుల్‌లోని కేఫ్ నీలోఫర్‌లో ఒక కప్పు ఇరానీ చాయ్‌ రూ.35 ఉంటుంది. బంజారాహిల్స్‌లో ఒక కప్పు ధర రూ.100. 1/2 కప్పు ఇరానీ చాయ్ ధర రూ.120 ఉంటుంది. ధర ఇంత ఉన్నా.. చాలామంది ఇరానీ చాయ్‌నే తాగడానికి ఇష్టపడతారు. కేఫ్ నీలోఫర్‌లో ఇరానీ చాయ్‌తో పాటు.. బన్ మస్కా, మలై బన్‌లు కూడా చాలా ఫేమస్. (istockphoto)

కేఫ్ నీలోఫర్ యజమాని బాబు రావు. ఇతను ఎందరికో స్పూర్తి. 1975లో అతను హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పుడు చేతిలో డబ్బు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. మొదట్లో ఓ కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వెయిటర్‌గా మారాడు. ఆసక్తితో టీ తయారు చేయడం నేర్చుకున్నాడు. 1993లో అతను సొంతంగా టీ షాప్ ప్రారంభించాడు. ఇప్పుడు బాబు రావు హైదరాబాద్‌లో చాలాచోట్ల అవుట్‌లెట్‌లను నడిపిస్తున్నాడు.

(3 / 6)

కేఫ్ నీలోఫర్ యజమాని బాబు రావు. ఇతను ఎందరికో స్పూర్తి. 1975లో అతను హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పుడు చేతిలో డబ్బు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. మొదట్లో ఓ కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వెయిటర్‌గా మారాడు. ఆసక్తితో టీ తయారు చేయడం నేర్చుకున్నాడు. 1993లో అతను సొంతంగా టీ షాప్ ప్రారంభించాడు. ఇప్పుడు బాబు రావు హైదరాబాద్‌లో చాలాచోట్ల అవుట్‌లెట్‌లను నడిపిస్తున్నాడు.(istockphoto)

ఇరానీ చాయ్ హైదరాబాద్‌కు వందేళ్ల కిందట వచ్చింది. ఇరానీ వలసదారులు దీన్ని ప్రారంభించారు. అయితే.. మొదటగా ఎక్కడ ఏర్పాటు చేశారో ఖచ్చితంగా తెలియకపోయినా.. గ్రాండ్ హోటల్‌లోని పురాతన కేఫ్‌లో 1935లో ప్రారంభించారని సమాచారం. ఇరానియన్ల వలస 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. వారిలో కొందరు పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లారు. మరికొందరు సముద్రం ద్వారా ముంబయి వచ్చారు. ఇంకా కొందరు హైదరాబాద్‌కు వచ్చారు. 

(4 / 6)

ఇరానీ చాయ్ హైదరాబాద్‌కు వందేళ్ల కిందట వచ్చింది. ఇరానీ వలసదారులు దీన్ని ప్రారంభించారు. అయితే.. మొదటగా ఎక్కడ ఏర్పాటు చేశారో ఖచ్చితంగా తెలియకపోయినా.. గ్రాండ్ హోటల్‌లోని పురాతన కేఫ్‌లో 1935లో ప్రారంభించారని సమాచారం. ఇరానియన్ల వలస 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. వారిలో కొందరు పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లారు. మరికొందరు సముద్రం ద్వారా ముంబయి వచ్చారు. ఇంకా కొందరు హైదరాబాద్‌కు వచ్చారు. (istockphoto)

హైదరాబాద్‌లో అమ్మే ఇరానీ చాయ్.. ఇరానీలు ఇంట్లో తాగేది కాదు. ఇరానియన్ యజమానులు నిర్వహించే ఈ కేఫ్‌లలో విక్రయించే టీ కారణంగా దీనిని అలా పిలుస్తారు. ఈ కేఫ్‌లలో పాలు, డికాక్షన్‌తో చాయ్ తయారు చేస్తారు. ఈ రెండింటిని రోజంతా నెమ్మదిగా మరిగించి చాయ్ తయారు చేస్తారు.

(5 / 6)

హైదరాబాద్‌లో అమ్మే ఇరానీ చాయ్.. ఇరానీలు ఇంట్లో తాగేది కాదు. ఇరానియన్ యజమానులు నిర్వహించే ఈ కేఫ్‌లలో విక్రయించే టీ కారణంగా దీనిని అలా పిలుస్తారు. ఈ కేఫ్‌లలో పాలు, డికాక్షన్‌తో చాయ్ తయారు చేస్తారు. ఈ రెండింటిని రోజంతా నెమ్మదిగా మరిగించి చాయ్ తయారు చేస్తారు.(istockphoto)

మన దగ్గర చాయ్ తాగడం కొత్త విషయం కాకపోయినా.. టీ తాగడాన్ని బ్రిటిష్ వారు పరిచయం చేశారనే వాదన ఉంది. ఇరానియన్లు భారతదేశంలో అడుగుపెట్టినప్పటికే.. ప్రజలు పాలతో పానీయం తాగడానికి అలవాటు పడ్డారు. ఇరానీయన్లు ఇది గ్రహించి.. కేఫ్‌లు ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది. క్రమంగా ఇరానీ కేఫ్‌లు మేధావులు, విద్యార్థుల కేంద్రంగా మారాయి. అక్కడ కూర్చుని రాజకీయాలను చర్చించేవారు. 

(6 / 6)

మన దగ్గర చాయ్ తాగడం కొత్త విషయం కాకపోయినా.. టీ తాగడాన్ని బ్రిటిష్ వారు పరిచయం చేశారనే వాదన ఉంది. ఇరానియన్లు భారతదేశంలో అడుగుపెట్టినప్పటికే.. ప్రజలు పాలతో పానీయం తాగడానికి అలవాటు పడ్డారు. ఇరానీయన్లు ఇది గ్రహించి.. కేఫ్‌లు ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది. క్రమంగా ఇరానీ కేఫ్‌లు మేధావులు, విద్యార్థుల కేంద్రంగా మారాయి. అక్కడ కూర్చుని రాజకీయాలను చర్చించేవారు. (istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు