ఐకూ నుంచి పవర్‌ఫుల్‍ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..-iqoo 13 launch date specifications expected price in india and other details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐకూ నుంచి పవర్‌ఫుల్‍ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..

ఐకూ నుంచి పవర్‌ఫుల్‍ ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇలా.. ధర ఎంత ఉండొచ్చంటే..

Nov 09, 2024, 04:29 PM IST Chatakonda Krishna Prakash
Nov 09, 2024, 04:17 PM , IST

iQOO 13: ఐకూ 13 మొబైల్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందో వెల్లడైంది. ఈ పవర్‌ఫుల్ ఫ్లాగ్‍షిప్ మొబైల్ వివరాలు ఇక్కడ చూడండి. 

ఐకూ 13 మొబైల్ అక్టోబర్ 30వ తేదీన చైనాలో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో డిసెంబర్ 3వ తేదీన విడుదలయ్యేందుకు రెడీ అయింది. స్నాప్‍డ్రాగన్ లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ సహా మరిన్ని ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది. 

(1 / 5)

ఐకూ 13 మొబైల్ అక్టోబర్ 30వ తేదీన చైనాలో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో డిసెంబర్ 3వ తేదీన విడుదలయ్యేందుకు రెడీ అయింది. స్నాప్‍డ్రాగన్ లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ సహా మరిన్ని ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైల్ కలిగి ఉంది. (iQOO China)

ఐకూ 13 మొబైల్ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా క్యూ2 చిప్‍సెట్ ఉంటుంది. ఐకూ 12తో పోలిస్తే ఈ నయా మోడల్ మరింత శక్తివంతంగా ఉండనుంది. ఐకూ 13ను కూడా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్‍గానే ఐకూ హైలైట్ చేస్తోంది. 

(2 / 5)

ఐకూ 13 మొబైల్ స్నాప్‍డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా క్యూ2 చిప్‍సెట్ ఉంటుంది. ఐకూ 12తో పోలిస్తే ఈ నయా మోడల్ మరింత శక్తివంతంగా ఉండనుంది. ఐకూ 13ను కూడా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్‍గానే ఐకూ హైలైట్ చేస్తోంది. (iQOO)

ఐకూ 13 ఫోన్ 6.82 ఇంచుల బీఓఈ క్యూ10 అమోలెడ్ డిస్‍ప్లేతో రానుందని తెలుస్తోంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్‍రేట్, 2కే రెజల్యూషన్ ఉండనుంది. ఫోన్ వెనుక లుక్ డిఫరెంట్‍గా ఉండేలా కస్టమైజ్ చేసుకునేలా హాలో లైట్ ఉంటుందని తెలుస్తోంది. 

(3 / 5)

ఐకూ 13 ఫోన్ 6.82 ఇంచుల బీఓఈ క్యూ10 అమోలెడ్ డిస్‍ప్లేతో రానుందని తెలుస్తోంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్‍రేట్, 2కే రెజల్యూషన్ ఉండనుంది. ఫోన్ వెనుక లుక్ డిఫరెంట్‍గా ఉండేలా కస్టమైజ్ చేసుకునేలా హాలో లైట్ ఉంటుందని తెలుస్తోంది. (iQOO)

ఐకూ 13 మొబైల్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ (ఎంపీ) సోనీ ఐఎంఎక్స్921 మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ కెమెరా ఉంది. చైనీస్ వేరియంట్‍కు ఈ కెమెరాలు ఉన్నాయి. మరి ఇండియాకు ఐకూ ఇలానే తీసుకొస్తుందా.. ఏమైనా మార్పులు చేస్తుందా అనేది చూడాలి. 

(4 / 5)

ఐకూ 13 మొబైల్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ (ఎంపీ) సోనీ ఐఎంఎక్స్921 మెయిన్ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. 50ఎంపీ కెమెరా ఉంది. చైనీస్ వేరియంట్‍కు ఈ కెమెరాలు ఉన్నాయి. మరి ఇండియాకు ఐకూ ఇలానే తీసుకొస్తుందా.. ఏమైనా మార్పులు చేస్తుందా అనేది చూడాలి. (iQOO)

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ 13 మొబైల్ రన్ అవుతుంది. ఈ ఫోన్‍లో 6,150ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఐకూ 13 ఫోన్ ప్రారంభ ధర ఇండియాలో రూ.49,999గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.  

(5 / 5)

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ 13 మొబైల్ రన్ అవుతుంది. ఈ ఫోన్‍లో 6,150ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఐకూ 13 ఫోన్ ప్రారంభ ధర ఇండియాలో రూ.49,999గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.  (Amazon)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు