IPL Top Scorers: కోహ్లీనే నంబర్ వన్..లిస్ట్ లో ముగ్గురు ఆడనివాళ్లే..ఐపీఎల్ ఆల్ టైం టాప్ స్కోరర్స్ పై ఓ లుక్కేయండి
- IPL Top Scorers: ఐపీఎల్ టీ20 మజాకు టైం దగ్గరపడుతోంది. మార్చి 22 నుంచి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2025 సిద్ధమవుతోంది. మరి లీగ్ హిస్టరీలో టాప్ స్కోరర్ ఎవరో చూసేయండి. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే.
- IPL Top Scorers: ఐపీఎల్ టీ20 మజాకు టైం దగ్గరపడుతోంది. మార్చి 22 నుంచి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2025 సిద్ధమవుతోంది. మరి లీగ్ హిస్టరీలో టాప్ స్కోరర్ ఎవరో చూసేయండి. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే.
(1 / 5)
ఐపీఎల్ ఆల్ టైం పరుగుల వీరుడి రికార్డు విరాట్ కోహ్లీదే. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ 252 మ్యాచ్ ల్లో 8004 పరుగులు చేశాడు. ఏకంగా 8 సెంచరీలు బాదాడు. కానీ ఇప్పటివరకూ ఐపీఎల్ కప్ ముద్దాడలేకపోయాడు.
(x/RCBTweets)(2 / 5)
ఐపీఎల్ లో శిఖర్ ధావన్ 222 మ్యాచ్ లాడాడు. ఈ గబ్బర్ 6769 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండు సెంచరీలు చేశాడు. 2024 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్.. ఇక ఐపీఎల్ లో కనిపించడు.
(x/FlashCric)(3 / 5)
ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ లో పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. 257 మ్యాచ్ ల్లో 6628 పరుగులు చేసిన హిట్ మ్యాన్ మూడో స్థానంలో ఉన్నాడు. రెండు సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. కెప్టెన్ గా రోహిత్ ముంబయికి 5 టైటిళ్లు అందించాడు.
(x/mufaddal_vohra)(4 / 5)
ఆస్ట్రేలియా లెజెండ్ డేవిడ్ వాార్నర్ కు ఐపీఎల్ లో ఘనమైన రికార్డుంది. ఈ లీగ్ లో వార్నర్ 184 మ్యాచ్ ల్లో 6565 పరుగులు చేశాడు. 4 సెంచరీలు బాదాడు. టాప్-5 బ్యాటర్లలో అతనిదే ఉత్తమ సగటు (40.52). కానీ ఇటీవల వేలంలో వార్నర్ ను ఏ జట్టూ కొనుక్కోలేదు.
(x/mufaddal_vohra)ఇతర గ్యాలరీలు