(1 / 10)
IPL Controversies: ఐపీఎల్ ప్రారంభమైన 2008లోనే ఫీల్డ్ లో శ్రీశాంత్ ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టడంతో దుమారం రేపింది. ఇది హర్భజన్ పై వేటుకు కారణమైంది.
(2 / 10)
IPL Controversies: ఐపీఎల్ కు ఆద్యుడైన అప్పటి కమిషనర్ లలిత్ మోదీని 2010లో నిషేధించడం కూడా సంచలనం సృష్టించింది.
(3 / 10)
IPL Controversies: ఐపీఎల్లో 2013 స్పాట్ ఫిక్సింగ్ వివాదం చాలా కాలంపాటు క్రికెట్ ను కుదిపేసింది. ముగ్గురు ప్లేయర్స్ ను ఈ మెగా లీగ్ కు శాశ్వతంగా దూరం చేసింది.
(4 / 10)
IPL Controversies: స్పాట్ ఫిక్సింగ్ వివాదంలోనే 2015లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై వేటు పడింది.
(5 / 10)
IPL Controversies: 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ వాంఖెడే స్టేడియంలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా అతనిపై స్టేడియంలోకి రాకుండా నిషేధం విధించారు. తర్వాత దీనిని ఎత్తేశారు.
(6 / 10)
IPL Controversies: ఐపీఎల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి మధ్య గొడవ కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది.
(7 / 10)
IPL Controversies: టీమిండియా స్టార్ ప్లేయర్ సౌరవ్ గంగూలీని 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్ తీసేయడం కూడా అతని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
(8 / 10)
IPL Controversies: ఐపీఎల్ 2010 నుంచి రవీంద్ర జడేజాను నిషేధించారు. ఆ ఏడాది రాజస్థాన్ రాయల్స్ తో కాంట్రాక్టుపై సంతకం చేయడానికి అతడు నిరాకరించడమే కారణం.
(9 / 10)
IPL Controversies: 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంఛైజీని ఐపీఎల్ నుంచి తొలగించడం కూడా సంచలనం సృష్టించింది.
ఇతర గ్యాలరీలు