(1 / 6)
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ లీగ్ హిస్టరీలోనే అత్యంత నిలకడ ప్రదర్శించే జట్టు ఇదే. ఈ టీమ్ 2010, 2011, 2018, 2021, 2023లో ట్రోఫీ సొంతం చేసుకుంది. లెజెండ్ ధోని కెప్టెన్ గా సీఎస్కేను తిరుగులేని శక్తిగా మార్చాడు.
(x/sachin_rt)(2 / 6)
ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లలో సీఎస్కేతో సమానంగా ముంబయి ఇండియన్స్ సాగుతోంది. ఆ టీమ్ కూడా అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ ముద్దాడింది. కెప్టెన్ గా రోహిత్ ముంబయికి అయిదు టైటిళ్లు అందించాడు.
(x/cricbuzz)(3 / 6)
సీఎస్కే, ముంబయి ఇండియన్స్ తర్వాత ఐపీఎల్ లో ఒకటి కంటే ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన జట్టు కేకేఆర్. ఆ టీమ్ 2012, 2014, 2024లో ట్రోఫీ చేజిక్కించుకుంది. రీసెంట్ గా 2024లో శ్రేయస్ సారథ్యంలో ఛాంపియన్ గా నిలిచింది.
(x/CricCrazyJohns)(4 / 6)
2008లో ఐపీఎల్ ఫస్ట్ టైటిల్ ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ కెప్టెన్సీలో జట్టు అదరగొట్టింది. ఆ సీజన్ ఫైనల్లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.
(x/Oam_16)(5 / 6)
ఐపీఎల్ లో అడుగుపెట్టిన సీజన్ లోనే టైటిల్ ముద్దాడి గుజరాత్ టైటాన్స్ సంచలనం క్రియేట్ చేసింది. 2022 సీజన్ లో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
(x/gujarat_titans)ఇతర గ్యాలరీలు