(1 / 5)
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్సు ప్లేయర్ గా నిలిచాడు. ఆదివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఆటగాడు డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
(instagram-vaibhav_sooryavanshi09)(2 / 5)
14 ఏళ్ల 23 రోజుల వయసులో వైభవ్ ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. లక్నోతో మ్యాచ్ లో అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడబోతున్నాడు. గాయపడ్డ కెప్టెన్ శాంసన్ స్థానంలో వైభవ్ టీమ్ లోకి వచ్చాడు.
(instagram-vaibhav_sooryavanshi09)(3 / 5)
2011 మార్చి 27న జన్మించిన వైభవ్.. ఐపీఎల్ స్టార్ట్ (2008) అయిన తర్వాత పుట్టి, ఈ లీగ్ లో ఆడబోతున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ బిహార్ ఆటగాణ్ని మెగా వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.
(instagram-vaibhav_sooryavanshi09)(4 / 5)
సూర్యవంశీ చాలా చిన్న వయస్సు నుంచే క్రికెట్లో అదరగొడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ అరంగేట్రం చేసిన అతను.. అతి పిన్న వయస్సులో రంజీ మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాగే లిస్ట్-ఎ క్రికెట్లో ఆడిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ కూడా అతడే.
(instagram-vaibhav_sooryavanshi09)(5 / 5)
2023 కూచ్ బెహార్ ట్రోఫీలో జార్ఖండ్ పై 151 పరుగుల ఇన్నింగ్స్ తో వైభవ్ వెలుగులోకి వచ్చాడు. ఇండియా-ఎ, బి, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఆడిన అండర్-19 టోర్నీలోనూ అతను అదరగొట్టాడు. అండర్-19 టెస్టులో కేవలం 58 బాల్స్ లోనే సెంచరీ చేశాడు. 2024 అండర్-19 ఆసియా కప్ లోనూ మెరిశాడు. ఇప్పటివరకూ 5 ఫస్ట్ క్లాస్, 6 లిస్ట్-ఎ, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు.
(instagram-vaibhav_sooryavanshi09)ఇతర గ్యాలరీలు