IPL 2025 Retention Live Streaming: రేపే ఉత్కంఠకు తెర: ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్ ఇదే
- IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్ అనౌన్స్‌మెంట్స్ రేపు (అక్టోబర్ 31) రానున్నాయి. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో ఐపీఎల్ జట్లు రేపు వెల్లడించనున్నాయి. ఈ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
- IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్ అనౌన్స్‌మెంట్స్ రేపు (అక్టోబర్ 31) రానున్నాయి. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో ఐపీఎల్ జట్లు రేపు వెల్లడించనున్నాయి. ఈ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
ఐపీఎల్ రిటెన్షన్ ఉత్కంఠకు రేపు (అక్టోబర్ 31) తెరపడనుంది. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో 10 ఐపీఎల్ జట్లు రేపటి సాయంత్రంలోగా జాబితా సమర్పించేయాలి. దీంతో ఏ జట్టు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుందో అధికారికంగా తేలిపోనుంది.
(PTI)(2 / 5)
ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగావేలం జరగనుంది. అయితే, ఆలోగా గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. గరిష్ఠంగా ఐదుగురు ఇంటర్నేషనల్ ఆటగాళ్లు, ఇద్దరు అన్‍క్యాప్డ్ ప్లేయర్లను జట్లు రిటైన్ చేసుకోవచ్చు. మొత్తంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో 10 జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటారో ఆసక్తి నెలకొంది.
(PTI)(3 / 5)
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్టును రేపు (అక్టోబర్ 31) సాయంత్రం 5 గంటలోపు 10 ఫ్రాంచైజీలు సమర్పించాలి. అయితే, ఈ రిటెన్షన్ లైవ్ కవరేజ్ సాయంత్రం 4 గంటలకే మొదలుకానుంది.
(PTI)(4 / 5)
ఐపీఎల్ రిటెన్షన్ స్పోర్ట్స్ 18 నెట్‍వర్క్, స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ కానుంది. రేపు (అక్టోబర్ 31) సాయంత్రం 4 గంటలకు ఆ ఛానెళ్లలో లైవ్ మొదలవుతుంది.
(PTI)ఇతర గ్యాలరీలు