(1 / 5)
ఐపీఎల్ 2025లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఆ టీమ్ భారీ విజయం సాధించింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో సన్‌రైజర్స్ ఫస్ట్ 286 పరుగులు చేసింది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ 2.200గా ఉంది.
(Surjeet Yadav)(2 / 5)
ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఈ సీజన్ ను ఘనంగా మొదలెట్టింది. ఆ టీమ్ 2.137 రన్ రేట్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్, కింగ్ కోహ్లి చెలరేగారు.
(PTI)(3 / 5)
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య మెరుపులతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో గెలుపు బోణీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన పంజాబ్ 0.550 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.
(PTI)(4 / 5)
అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా గెలుపుతో ఈ సీజన్ ను మొదలెట్టింది. చెపాక్ లో ముంబయి ఇండియన్స్ ను చిత్తుచేసింది. బౌలింగ్ లో నూర్ అహ్మద్.. బ్యాటింగ్ తో కెప్టెన్ రుతురాజ్, రచిన్ రవీంద్ర మెరిశారు. 0.493 నెట్ రన్ రేట్ తో ఆ టీమ్ నాలుగో ప్లేస్ లో ఉంది.
(PTI)(5 / 5)
వైజాగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్లో అయిదో ప్లేస్ లో ఉంది. అశుతోష్ శర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో ఢిల్లీ 1 వికెట్ తేడాతో గెలిచింది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ 0.371గా ఉంది. ఇక ఇంకా బోణీ కొట్టని లక్నో, ముంబయి, గుజరాత్, కోల్ కతా, రాజస్థాన్ వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
(Surjeet Yadav)ఇతర గ్యాలరీలు