(1 / 10)
ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటన్స్ తొలి స్థానంలో ఉంది. ఈ సీజన్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ మాజీ ఛాంపియన్స్ ప్రస్తుతం 8 మ్యాచ్ లలో 6 గెలిచి, 2 ఓడి 12 పాయింట్లు, 1.104 నెట్ రన్‌రేట్ తో టాప్ లో కొనసాగుతోంది.
(AP)(2 / 10)
అక్షర్ పటేల్ కెప్టెన్సీలో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 8 మ్యాచ్ లలో 6 గెలిచి 2 ఓడింది. 12 పాయింట్లు, 0.657 నెట్ రన్‌రేట్ తో రెండో స్థానంలో ఉంది.
(REUTERS)(3 / 10)
ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు విజయాలతో అనూహ్యంగా మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ ప్రస్తుతం 9 మ్యాచ్ లలో 5 విజయాలు, 4 ఓటములతో 10 పాయింట్లు, 0.673 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.
(AFP)(4 / 10)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 8 మ్యాచ్ లలో 5 గెలిచి మూడు ఓడింది. 10 పాయింట్లు, 0.472 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది.
(AFP)(5 / 10)
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ కూడా 8 మ్యాచ్ లలో 5 గెలిచి, 3 ఓడి 10 పాయింట్లు, 0.177 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
(PTI)(6 / 10)
రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ 9 మ్యాచ్ లలో 5 గెలిచి 4 ఓడింది. 10 పాయింట్లు, -0.054 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది.
(Surjeet Yadav)(7 / 10)
కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ లలో 3 గెలిచి, ఐదు ఓడింది. 6 పాయింట్లు, 0.212 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది.
(AFP)(8 / 10)
రాజస్థాన్ రాయల్స్ టీమ్ 8 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, ఆరు ఓడింది. 4 పాయింట్లు, -0.633 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఈ టీమ్ మిగిలిన ఆరు మ్యాచ్ లలో అన్నీ లేదా కనీసం ఐదు మ్యాచ్ లైనా గెలవాల్సిందే. అయినా అంత సులువు కాదు.
(AP)(9 / 10)
సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను ఇక వదులుకోవాల్సిందే. ఆ టీమ్ కూడా 8 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, 6 ఓడింది. 4 పాయింట్లు, -1.361 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచ్ లనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులో ఉంది. అది అంత సులువైన పని కాదు.
(Saikat Paul)ఇతర గ్యాలరీలు