(1 / 5)
లక్నో సూపర్ జెయింట్స్ డేంజరస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ తో సాగుతున్నాడు. ఈ వెస్టిండీస్ ఆటగాడు 7 ఇన్నింగ్స్ ల్లో 357 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 208కి పైగా ఉండటం విశేషం.
(PTI)(2 / 5)
ఐపీఎల్ గత రెండు మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఈ సారి కూడా పరుగుల వేటలో సాగుతున్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ ఐపీఎల్ 2025లో 6 ఇన్నింగ్స్ ల్లో 329 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.
(Surjeet )(3 / 5)
ఆరెంజ్ క్యాప్ రేసులో మరో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కూడా దూసుకెళ్తున్నాడు. మిచెల్ మార్ష్ 6 ఇన్నింగ్స్ ల్లో 295 రన్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఆసీస్ క్రికెటర్ కూడా 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
(Surjeet Yadav)(4 / 5)
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ లతో చెలరేగుతున్నాడు. అతను 5 ఇన్నింగ్స్ ల్లో 250 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 208గా ఉంది.
(AFP)ఇతర గ్యాలరీలు