ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన కోహ్లి.. టాప్ లో ఎవరున్నారంటే? లిస్ట్ పై ఓ లుక్కేయండి-ipl 2025 orange cap list virat kohli in second place sai sudarshan on top check this list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన కోహ్లి.. టాప్ లో ఎవరున్నారంటే? లిస్ట్ పై ఓ లుక్కేయండి

ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన కోహ్లి.. టాప్ లో ఎవరున్నారంటే? లిస్ట్ పై ఓ లుక్కేయండి

Published Apr 25, 2025 11:16 AM IST Chandu Shanigarapu
Published Apr 25, 2025 11:16 AM IST

ఐపీఎల్ 2025లో నిలకడగా రాణిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. ఆర్సీబీ తరపున ఈ టాప్ ప్లేయర్ అదరగొడుతున్నాడు. మరి కోహ్లి ఏ ప్లేస్ లో ఉన్నాడు? టాప్ లో ఎవరున్నారో? ఓ లుక్కేయండి.

ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ దగ్గరే ఉంది. ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు పరుగుల వేటలో దూసుకెళ్తున్నాడు. 8 ఇన్నింగ్స్ ల్లో 417 పరుగులు చేశాడు. అయిదు హాఫ్ సెంచరీలు సాధించాడు.

(1 / 5)

(Hindustan Times)

ఫార్మాట్ ఏదైనా.. ఎక్కడ ఆడినా నిలకడగా పరుగులు సాధిస్తున్న రన్ మెషిన్ విరాట్ ఈ ఐపీఎల్ సీజన్ లోనూ సత్తాచాటుతున్నాడు. 9 ఇన్నింగ్స్ ల్లో 392 పరుగులతో సెకండ్ ప్లేస్ కు దూసుకొచ్చాడు. కోహ్లి కూడా 5 ఫిఫ్టీస్ సాధించాడు.

(2 / 5)

(Surjeet Yadav)

గత రెండు మూడు మ్యాచ్ ల్లో ఫెయిల్ అయినప్పటికీ ఐపీఎల్ 2025లో టాప్-5 రన్నర్స్ లిస్ట్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ పూరన్ కొనసాగుతున్నాడు. 9 ఇన్నింగ్స్ ల్లో 377 పరుగులు చేసిన అతను మూడో ప్లేస్ లో ఉన్నాడు.

(3 / 5)

(PTI)

మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఐపీఎల్ లో జోరు కొనసాగిస్తున్నాడు. ఈ ముంబయి స్టార్ బ్యాటర్ 9 ఇన్నింగ్స్ ల్లో 373 పరుగులు సాధించాడు.

(4 / 5)

(AFP)

గుజరాత్ టైటాన్స్ డేంజరస్ బ్యాటర్ బట్లర్ కూడా ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. అతను 8 ఇన్నింగ్స్ ల్లో 356 పరుగులు సాధించాడు.

(5 / 5)

(Surjeet)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు