IPL 2025 Tickets Sale: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఎప్పుడు? ఎక్కడ? దొరుకుతాయంటే? రేట్ ఎంతో తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి
- IPL 2025 Tickets Sale: ఐపీఎల్ 18వ సీజన్ కు సమయం దగ్గరపడుతోంది. 2025 ఐపీఎల్ మార్చి 22న ఆరంభమవుతుంది. టీ20 కిక్కిచ్చే ఈ లీగ్ టికెట్ల కోసం ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి టికెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.
- IPL 2025 Tickets Sale: ఐపీఎల్ 18వ సీజన్ కు సమయం దగ్గరపడుతోంది. 2025 ఐపీఎల్ మార్చి 22న ఆరంభమవుతుంది. టీ20 కిక్కిచ్చే ఈ లీగ్ టికెట్ల కోసం ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి టికెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి.
(1 / 5)
ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటికే మార్చి 23న ఈ స్టేడియంలో రాజస్థాన్ తో సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ అయింది. ఇక్కడ జరిగే అన్ని మ్యాచ్ లకు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ (https://www.district.in/events/ipl-ticket-booking) లో టికెట్లు కొనొచ్చు. ప్రైస్ రేంజ్ రూ.2750 నుంచి రూ.30 వేల మధ్య ఉంది. వైజాగ్ లో ఢిల్లీ ఆడే మ్యాచ్ లు.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ల టికెట్లూ ఇదే వెబ్ సైట్లో ఉంటాయి.
(x/SunRisers)(2 / 5)
సీఎస్కే ఆడుతుందంటే ధోనీని చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతుంటారు. ఈ సీజన్లో చెపాక్ లో ముంబయితో ఆ టీమ్ మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ టికెట్లు మార్చి 19 నుంచి chennaisuperkings.com, district.in వెబ్ సైట్లో ఉంటాయి. రూ.1700 నుంచి టికెట్ రేట్ స్టార్ట్ అవుతుంది.
(x/ChennaiIPL)(3 / 5)
ఐపీఎల్ టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉన్న ఆర్సీబీ ఈ సీజన్ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆ టీమ్ ఆడే మ్యాచ్ ల టికెట్లు https://www.royalchallengers.com వెబ్ సైట్లో కొనుక్కోవచ్చు. రేటు రూ.3 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండనుంది.
(x/RCBTweets)(4 / 5)
ముంబయి ఇండియన్స్ టికెట్లు bookmyshow.com వెబ్ సైట్లో కొనుక్కోవచ్చు. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ల టికెట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. టికెట్ రేట్ రూ.999 నుంచి స్టార్ అవుతుంది.
(x/MIFansArmy)(5 / 5)
డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ లో ఆడే టికెట్లు కూడా బుక్ మై షోలో ఉన్నాయి. మార్చి 22న సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ ఇదే మైదానంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరుగుతుంది. ఈ టికెట్ల రేట్ రూ.900 నుంచి స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లూ బుక్ మై షో లోనే ఉన్నాయి.
(x/ShreyasIyer15)ఇతర గ్యాలరీలు