(1 / 5)
గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు తమన్ మ్యూజికల్ ఫీస్ట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో అతను స్టేడియాన్ని హోరెత్తించాడు.
(AFP)(2 / 5)
తమన్ తో పాటు సింగర్స్ గీతా మాధురి తదితరులు తమ సింగింగ్ తో ఫ్యాన్స్ ను అలరించారు. ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించారు.
(Surjeet Yadav)(3 / 5)
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. హిట్ సాంగ్స్ తో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు. ముఖ్యంగా పవన్ కల్యాన్ సినిమా ‘ఓజీ’ లోని ‘హంగ్రీ చీతా’ సాంగ్ పాడినప్పుడు స్టేడియం ఊగిపోయింది. ఫ్యాన్స్ కూడా తమన్ కు కోరస్ ఇచ్చారు.
(PTI)(4 / 5)
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 10 ఫ్రాంఛైజీల హోం గ్రౌండ్ లోనూ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ను ఐపీఎల్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజిక్ షో నిర్వహించారు.
(AP)ఇతర గ్యాలరీలు