(1 / 5)
ఐపీఎల్ 2024లో వీర బాదుడుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త బ్యాటింగ్ ప్రమాణాలు నెలకొల్పింది. రికార్డులు దుమ్ము దులిపింది. గతేడాది ఫైనల్ చేరినా జట్టు టైటిల్ పోరులో ఓడిపోయింది. ఈ సీజన్ లో టైటిల్ అందుకోవాలనే టార్గెట్ తోనే బరిలో దిగుతోంది.
(x/mufaddal_vohra)(2 / 5)
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ ను ఆ టీమ్ ఢీ కొడుతుంది. గతేడాది ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోసిన హెడ్ (567 పరుగులు), క్లాసెన్ (479)పై మరోసారి ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
(x/SunRisers)(3 / 5)
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకే స్టార్ట్ కానుంది. గత సీజన్ లో 204కు పైగా స్ట్రైక్ రేట్ తో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిషేక్ శర్మ (484) మరోసారి సత్తాచాటేందుకు సై అంటున్నాడు. ఈ సారి ఇషాన్ కిషన్ కూడా టీమ్ లో చేరడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ గా మారింది.
(x/SunRisers)(4 / 5)
రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ను టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్స్ లో చూడొచ్చు. గత సీజన్ లో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ చేతిలోనే ఓడింది. శాంసన్ ఇంకా పూర్తిగా ఫిట్ గా మారకపోవడంతో ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ కు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
(x/rajasthanroyals)ఇతర గ్యాలరీలు