(1 / 5)
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ నుంచి అహ్మదాబాద్ కు ఫైనల్ తరలించారు.
(REUTERS)(2 / 5)
అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ తో పాటు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగబోతుంది. జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ కు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తుంది.
(REUTERS)(3 / 5)
ఇక ఐపీఎల్ 2025లో మిగిలిన రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు చండీగఢ్ లోని ముల్లాన్ పూర్ లో ఉన్న పంజాబ్ క్రికెట్ సంఘం కొత్త స్టేడియం ఆతిథ్యమిస్తుంది. ఇక్కడ మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్ జరుగుతాయి.
(HT_PRINT)(4 / 5)
ఫస్ట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్.. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఎలిమినేటర్ 2, ఫైనల్ జరగాల్సింది. కానీ భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా సీజన్ మధ్యలో తొమ్మిది రోజుల పాటు సస్పెండ్ అయింది. ఆ తర్వాత వాతావరణం, సెక్యూరిటీ కారణాల వల్ల ప్లేఆఫ్స్ షెడ్యూల్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికే గుజరాత్, పంజాబ్ ప్లేఆఫ్స్ చేరడంతో.. ఆయా హోం గ్రౌండ్స్ లో ఆడితే ఆ టీమ్స్ కు ప్రయోజనం కలుగుతుంది.
(REUTERS)(5 / 5)
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ వేదికను లక్నోకు మార్చారు. మే 23న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షం ఎఫెక్ట్ పడే ఐపీఎల్ మ్యాచ్ లకు అదనంగా రెండు గంటల సమయాన్నిస్తున్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు