(1 / 5)
సిరాజా.. మజాకా. ఐపీఎల్ 2025లో ఈ పేసర్ బౌలింగ్ మామూలుగా లేదు. గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న సిరాజ్ డేంజరస్ పేస్ బౌలింగ్ తో బ్యాటర్లను వణికిస్తున్నాడు. 4 ఇన్నింగ్స్ ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
(HT_PRINT)(2 / 5)
ఐపీఎల్ 2025లో సిరాజ్ అత్యధిక వికెట్ల వీరుల్లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై నాలుగు వికెట్లు తీసిన అతను.. ఐపీఎల్ లో తన బెస్ట్ నంబర్స్ (4/17) ను అందుకున్నాడు.
(AFP)(3 / 5)
పడినా పైకి ఎలా ఎగరాలో.. ఫెయిల్యూర్స్ ను దాటి ఎలా ఎదగాలో సిరాజ్ చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో విఫలమవడంతో సిరాజ్ కు టీమిండియా జట్టులో చోటు పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలక్ట్ చేయలేదు.
(AFP)(4 / 5)
ఇక ఐపీఎల్ లో ఏడేళ్లుగా ఆడిన ఆర్సీబీ.. ఈ సీజన్ కు ముందు సిరాజ్ ను వద్దనుకుంది. రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ హైదరాబాద్ పేసర్ కుంగిపోయాడు. కానీ ఆగిపోలేదు. సత్తాచాటాలనే లక్ష్యంతో సమరానికి సై అన్నాడు.
(REUTERS)(5 / 5)
మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ పేసర్ గా ఆడిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితోనూ సిరాజ్ అద్భుతాలు చేస్తున్నాడు. తిరిగి టీమిండియాలోకి రావాలనే కసితో చెలరేగుతున్నాడు. ఐపీఎల్ లో 100 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు.
(AFP)ఇతర గ్యాలరీలు