(1 / 5)
2025 ఐపీఎల్ కు ఢిల్లీ క్యాపిటల్స్ మరింత జోష్ తెచ్చింది. సోమవారం (మార్చి 24) వైజాగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 1 వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది. 210 పరుగుల ఛేజింగ్ లో 113/6తో నిలిచిన ఢిల్లీని అశుతోష్ శర్మ అద్భుత పోరాటంతో గెలిపించాడు. 31 బాల్స్ లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు.
(Surjeet Yadav)(2 / 5)
2023 ఐపీఎల్ సీజన్ లో లక్నో కూడా ఇలాంటి 1 వికెట్ థ్రిల్లింగ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించింది. 213 పరుగులు ఛేజింగ్ లో 23/3తో కష్టాల్లో పడ్డ లక్నోను స్టాయినిస్ (30 బంతుల్లో 65 పరుగులు), పూరన్ (19 బంతుల్లో 62), ఆయూష్ బదోని (24 బంతుల్లో 30) సూపర్ ఇన్నింగ్స్ లు ఆడారు. చివరి బాల్ ను మిస్ చేసిన అవేశ్ ఖాన్.. బై రూపంలో సింగిల్ తీయడంతో లక్నో గెలిచింది.
(x/Cric_records45)(3 / 5)
2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ముంబయి ఇండియన్స్ పై 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. మొదట ముంబయి 147/8 స్కోర్ చేసింది. ఛేదనలో పవర్ ప్లేలో 56/0తో నిలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత తడబడి 75 పరుగుల తేడాతో 9 వికెట్లు కోల్పోయింది. అజేయంగా 32 పరుగులు చేసిన దీపక్ హుడా ఆఖరి ఓవర్లో కీలకమైన సిక్సర్ కొట్టాడు. లాస్ట్ బాల్ కు బిల్లీ స్టాన్ లేక్ సింగిల్ తో హైదరాబాద్ గెలిచింది.
(x/Battle_06)(4 / 5)
2018 సీజన్ లోనే మరో 1 వికెట్ విన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను ఊపేసింది. రెండేళ్ల బ్యాన్ తర్వాత తిరిగి లీగ్ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 1 వికెట్ తేడాతో ముంబయి ఇండియన్స్ పై గెలిచింది. 166 పరుగుల ఛేజింగ్ లో 75/5తో సీఎస్కే ఇబ్బందుల్లో పడింది. ఆ దశలో డ్వేన్ బ్రావో చెలరేగాడు. కానీ గాయంతో అంతకంటే ముందే బ్యాటింగ్ నుంచి రిటైర్ట్ హార్ట్ గా వెనుదిరిగిన కేదార్ జాదవ్ లాస్ట్ ఓవర్లో మళ్లీ బ్యాటింగ్ కు వచ్చి ఓ సిక్సర్, ఫోర్ తో చెన్నైని గెలిపించాడు.
(x/CskIPLTeam)(5 / 5)
2015 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 1 వికెట్ తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై నెగ్గింది. 184 రన్స్ ఛేజింగ్ లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ప్రధాన బ్యాటర్స్ ఔటవడంతో చివర్లో ఉత్కంఠ రేగింది. కానీ మరో బంతి ఉందనగా నరైన ఓ పరుగు తీసి జట్టును గెలిపించాడు.
(x/Rokte_Amarr_KKR)ఇతర గ్యాలరీలు