(1 / 5)
మేరే మిట్టి సాంగ్ తో మొదలైన క్లోజింగ్ సెర్మనీ ఫస్ట్ పర్ ఫార్మెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. జై హో అంటూ ఆడియన్స్ తో కేరింతలు కొట్టించింది. ఇండియా వాలే సాంగ్ తో స్టేడియం మార్మోగిపోయింది. అదే సమయంలో ఆకాశంలో విమానాలు త్రివర్ణ పతాక రంగులతో నింపేశాయి.
(screegrab-hotstar)(2 / 5)
శంకర్ మహదేవన్ సింగింగ్ ఈవెంట్ గూస్ బంప్స్ తెప్పించింది. తన కొడుకులతో కలిసి ఆయన దేశభక్తి గీతాలు పాడుతుంటే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారత త్రివిధ దళాల సత్తా తెలిపే వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
(PTI)(3 / 5)
వందేమాతరం అంటూ శంకర్ మహదేవన్ గొంతెత్తితే స్టేడియం మొత్తం ఊగిపోయింది. లక్ష గొంతుకలు ఒక్కటై వందేమాతరం అంటూ గర్జించాయి.
(PTI)(4 / 5)
ఐపీఎల్ 2025 క్లోజింగ్ సెర్మనీ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు చూపిన వీరత్వాన్ని తలుచుకుంటూ అభిమానులు ఉప్పొంగిపోయాడు. భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.
(PTI)(5 / 5)
క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా విమానాలు త్రివర్ణ పతాక రంగులు వెదజల్లుతూ ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత జాతీయ పతాకంతో పాటు త్రివిధ దళాల జెండాలను హెలికాఫ్టర్లు ప్రదర్శించాయి.
(screengrab-hotstar)ఇతర గ్యాలరీలు