(1 / 5)
ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్న ఆర్సీబీకి గుడ్ న్యూస్. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో అదరగొడుతున్న ఆ టీమ్ స్టార్ పేసర్ హేజిల్ వుడ్ తిరిగొస్తున్నాడు.
(PTI)(2 / 5)
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. ప్లేఆఫ్స్ చేరడంలో హేజిల్ వుడ్ కీలక పాత్ర పోషించాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 18 వికెట్లు తీశాడు. ఆ టీమ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా కొనసాగుతున్నాడు.
(AP)(3 / 5)
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ తొమ్మిది రోజుల పాటు సస్పెండ్ కావడానికి ముందే హేజిల్ వుడ్ గాయంతో ఓ మ్యాచ్ కు దూరమయ్యాడు. మధ్యలో బ్రేక్ రావడంతో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
(PTI)(4 / 5)
హేజిల్ వుడ్ తిరిగి ఇండియా రావడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ స్టార్ పేసర్ తిరిగి టీమ్ లోకి వస్తున్నాడు. ప్లేఆఫ్స్ కు ముందు మే 25న అతను ఆర్సీబీ టీమ్ తో చేరబోతున్నాడు.
(AFP)(5 / 5)
12 మ్యాచ్ ల్లో 8 గెలిచిన ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరుకుంది. ఆ టీమ్ ఇంకా సన్ రైజర్స్ (మే 23) తో, లక్నో (మే 27)తో తలపడనుంది. మే 29 నుంచి ప్లేఆఫ్స్ స్టార్ట్ అవుతాయి.
(AP)ఇతర గ్యాలరీలు