(1 / 7)
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అతను 15 మ్యాచ్ ల్లో 759 పరుగులు సాధించాడు. 6 హాఫ్ సెంచరీలు, ఓ అర్ధశతకం బాదాడు. ఎమర్జింగ్ ప్లేయర్, ఫాంటసీ కింగ్, మోస్ట్ ఫోర్స్ (88) అవార్డులనూ సుదర్శన్ అందుకున్నాడు.
(PTI)(2 / 7)
పర్పుల్ క్యాప్ ను గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ సొంతం చేసుకున్నాడు. 15 మ్యాచ్ ల్లో అతను 25 వికెట్లు సొంతం చేసుకున్నాడు.
(Surjeet Yadav)(3 / 7)
అత్యధిక సిక్సర్ల అవార్డు నికోలస్ పూరన్ సొంతమైంది. ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు 40 సిక్సర్లు బాదాడు.
(REUTERS)(4 / 7)
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఓ అవార్డు దక్కించుకున్నాడు. అతను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో 206.6 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
(AFP)(5 / 7)
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. 320,5 పాయింట్లతో అతను టాప్ లో నిలిచాడు. సూర్య 717 పరుగులు సాధించాడు.
(Surjeet )(6 / 7)
క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు సన్ రైజర్స్ ఆటగాడు కమిందు మెండిస్ ఖాతాలో చేరింది. సీఎస్కే తో మ్యాచ్ లో బ్రేవిస్ క్యాచ్ ను మెండిస్ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు.
(AFP)(7 / 7)
ఐపీఎల్ 2025 సీజన్ కు గాను ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ కు దక్కింది. ఈ టీమ్ మ్యాచ్ కు 10.21 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇతర గ్యాలరీలు