RR vs RCB Head to Head: నేడు రాజస్థాన్, ఆర్సీబీ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..
- RR vs RCB Head to Head: ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 6) రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ రికార్డ్స్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
- RR vs RCB Head to Head: ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 6) రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ రికార్డ్స్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు తాను ఆడిన మూడు మ్యాచ్‍ల్లో గెలిచి ఫుల్ జోష్‍లో ఉంది సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ (RR). ఇక ఈ సీజన్‍లో నాలుగు మ్యాచ్‍లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటే గెలిచి.. మూడింట ఓడి కష్టాల్లో ఉంది. ఈ రెండు జట్ల మధ్య నేడు (ఏప్రిల్ 6) జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
(ANI)(2 / 5)
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పరస్పరం 30 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. వీటిలో బెంగళూరు 15 సార్లు గెలువగా.. రాజస్థాన్ 12సార్లు విజయం సాధించింది. 3 మ్యాచ్‍లు రద్దయ్యాయి. రెండు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ రికార్డ్ పరంగా బెంగళూరు కాస్త మెరుగ్గా ఉంది.
(PTI)(3 / 5)
ఐపీఎల్‍లో జైపూర్ వేదికగా ఇప్పటి వరకు రాజస్థాన్, బెంగళూరు 8 మ్యాచ్‍ల్లో ఢీకొన్నాయి. వీటిలో రాజస్థాన్ నాలుగు, బెంగళూరు నాలుగు మ్యాచ్‍ల్లో విజయం సాధించాయి.
(ANI)(4 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు రాజస్థాన్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగే జైపూర్ సవాయ్ మాన్‍సింగ్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‍లో ఇప్పటికే ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‍ల్లో పిచ్ బ్యాటర్లకు మద్దతునిచ్చింది. ఈ పిచ్‍లో మంచి బౌన్స్, పేస్ ఉంటుంది. అయితే, మ్యాచ్ జరుగుతున్న కొద్ది కాస్త స్లో అయి స్పిన్నర్లకు కాస్త సహకారం లభిస్తుంది.
(AFP)ఇతర గ్యాలరీలు