IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ల జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లి, ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ క్యాప్స్ ను నిలబెట్టుకున్నారు.
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ల జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లి, ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ క్యాప్స్ ను నిలబెట్టుకున్నారు.
(1 / 6)
IPL 2024 Orange Cap: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ తన పర్పుల్ క్యాప్ తిరిగి అందుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన అతడు.. ప్రస్తుతం 4 మ్యాచ్ లలో 9 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.అతని తర్వాత రాజస్థాన్ బౌలర్ చహల్ ఉన్నాడు.
(2 / 6)
IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ పర్పుల్ క్యాప్ లిస్టులో రెండో స్థానానికి పడిపోయాడు. చహల్ 4 మ్యాచ్ లలో 8 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తూ అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న చహల్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
(3 / 6)
IPL 2024 Orange Cap: ముంబై ఇండియన్స్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జా, గుజరాత్ టైటన్స్ బౌలర్ మోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఏడేసి వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అయితే కొయెట్జా 4 మ్యాచ్ లలోనే 7 వికెట్లు తీసుకోగా.. మోహిత్, ఖలీల్ ఐదేసి మ్యాచ్ లలో ఏడేసి వికెట్లు తీశారు.
(4 / 6)
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ పరిస్థితి దారుణంగానే ఉన్నా.. ఆరెంజ్ క్యాప్ ను మాత్రం విరాట్ కోహ్లియే సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. అతడు 5 మ్యాచ్ లలో 316 రన్స్ చేశాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ కూడా అతడే చేసిన విషయం తెలిసిందే. రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
(5 / 6)
IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అయితే అతడు కోహ్లి కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. సుదర్శన్ 5 మ్యాచ్ లలో 191 రన్స్ చేశాడు.
ఇతర గ్యాలరీలు