IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?-ipl 2023 updated orange cap and purple cap list after mi vs rcb match ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?

IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?

Updated May 10, 2023 10:30 AM IST Anand Sai
Updated May 10, 2023 10:30 AM IST

  • IPL 2023 : వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ, ఫాఫ్ డుప్లెసిస్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ తో ముందున్నాడు. ఇంతకీ ఆరెంట్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?

మంగళవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ మరో అర్ధ సెంచరీ చేశాడు. అతని జట్టు ఓడిపోయినప్పటికీ, 65 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను నిలుపుకొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తన స్థానాన్ని పటిష్టం చేస్తూనే ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 576 స్కోర్ చేశాడు.

(1 / 10)

రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ 11 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతని స్కోరు 124. సగటు 43.36. స్ట్రైక్రేట్ 160.60గా ఉంది.

(2 / 10)

ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 469 పరుగులు చేశాడు. సగటు 46.90. స్ట్రైక్రేట్ 143.42గా ఉంది.

(3 / 10)

డెవాన్ కాన్వే కూడా మంచి పోజిషన్లో ఉన్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో మొత్తం 458 పరుగులు చేశాడు. సగటు 57.25. స్ట్రైక్రేట్ 139.20.

(4 / 10)

(AFP)

మంగళవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పై కోహ్లి నిరాశపరిచాడు. 1 పరుగు మాత్రమే చేశాడు. అయితే ఆరెంజ్ క్యాప్ పోరులో కోహ్లీ టాప్ ఫైవ్ లో ఉన్నాడు. RCB స్టార్ విరాట్ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 420 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 82 నాటౌట్. సగటు 42.00. స్ట్రైక్రేట్ 133.75.

(5 / 10)

ఇక పర్పుల్ క్యాప్‌లో మహ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం షమీ వికెట్ల సంఖ్య 19. ప్రస్తుత ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 43 ఓవర్లు బౌలింగ్ చేసి 311 పరుగులు ఇచ్చి 19 వికెట్లు పడగొట్టాడు. షమీ అత్యుత్తమ ప్రదర్శన 11/4గా ఉంది.

(6 / 10)

పర్పుల్ క్యాప్ జాబితాలో రషీద్ ఖాన్ మళ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో రషీద్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు ఇచ్చాడు. మొత్తం 44 ఓవర్లు బౌలింగ్ చేసి 19 వికెట్లు పడగొట్టాడు.

(7 / 10)

పర్పుల్ క్యాప్ రేసులో CSKకి చెందిన తుషార్ దేశ్‌పాండే మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు తుషార్ 11 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. 38 ఓవర్లలో 396 పరుగులు ఇచ్చాడు. అత్యుత్తమ ప్రదర్శన 45/3గా ఉంది.

(8 / 10)

పర్పుల్ క్యాప్ రేసులో ముంబై ఇండియన్స్‌కు చెందిన పీయూష్ చావ్లా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 43 ఓవర్లు బౌలింగ్ చేసి 321 పరుగులతో 17 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 22/3.

(9 / 10)

కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ రేసులో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 41 ఓవర్లలో 327 పరుగులు ఇచ్చాడు. 17 వికెట్లు తీశాడు.

(10 / 10)

ఇతర గ్యాలరీలు