IPL 2023 : వీళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారా?
IPL 2023 : వీళ్లకు ఇదే చివరి ఐపీఎల్ కానుందా? ఈ సీజన్ తర్వాత ఈ దిగ్గజ ప్లేయర్స్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారా? ఐపీఎల్ 16వ సీజన్ వచ్చే శుక్రవారం (మార్చి 31) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ, దినేష్ కార్తీక్, వార్నర్, అంబటి రాయుడులాంటి ప్లేయర్స్ పైనే అందరి కళ్లూ ఉన్నాయి.
(1 / 6)
IPL 2023: ఈ లిస్టులో ఉండే మొదటి ప్లేయర్ ఎమ్మెస్ ధోనీయే. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇప్పటికే రెండు సీజన్లు ఆడిన ధోనీ వయసు ప్రస్తుతం 41 ఏళ్లు. ఫిట్‌నెస్ పరంగా అతనికి ఇప్పటికీ తిరుగు లేకపోయినా.. ఇక తాను తప్పుకొని ఓ యువ ఆటగానికి చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది. ఈ ఏడాది సొంత ప్రేక్షకుల ముందు తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
(2 / 6)
IPL 2023: మన హైదరాబాదీ బ్యాటర్ అంబటి రాయుడు వయసు 38 ఏళ్లు. పైగా గత సీజన్ లో పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు.
(3 / 6)
IPL 2023: లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఇక ఐపీఎల్లో కనిపించకపోవచ్చు. 40 ఏళ్ల మిశ్రా ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నా.. మునుపటి సత్తా అతనిలో లేదు.
(4 / 6)
IPL 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కనిపించనున్నాడు. పంత్ లేకపోవడంతో అతనికి కెప్టెన్సీ అవకాశం దక్కింది. అయితే 36 ఏళ్ల వార్నర్ కూడా ఈ సీజన్ తర్వాత లీగ్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
(5 / 6)
IPL 2023: గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ నుంచి బెస్ట్ ఫినిషర్ గా ఎదిగి తర్వాత టీమిండియాలోకి తిరిగొచ్చిన వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. తొలి టీ20 వరల్డ్ కప్ నుంచి ఆడుతున్న 37 ఏళ్ల కార్తీక్.. ఈ సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు