(1 / 5)
ఐఫోన్ ఎస్ఈ 4 (ఐఫోన్ 16ఈ): యాపిల్ తన తదుపరి ఈవెంట్‍లో ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్‍ను లాంచ్ చేయనుందని అంచనాలు ఉన్నాయి. దీని పేరు ఐఫోన్ 16ఈ అని కూడా ఉండొచ్చని తెలుస్తోంది. యాపిల్‍లో ఎస్ఈ మోడళ్లే చవకైనవిగా ఉంటాయి. ఓఎల్ఈడీ డిస్‍ప్లే, ఏ18 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 48 మెగాపిక్సెల్ కెమెరాను ఈ నయా ఎస్ఈ ఫోన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మొబైల్ కోసం చాలా మంది వేచిచూస్తున్నారు.
(Sonny Dickson/X)(2 / 5)
ఎం4 మ్యాక్‍బుక్ ఎయిర్: ఎం4 చిప్‍తో కొత్త జనరేషన్ మ్యాక్‍బుక్ ఎయిర్‌ను యాపిల్ తీసుకురానుంది. ఎం4 మ్యాక్‍బుక్ ఎయిర్ లాంచ్ కానుంది. నానో టెక్స్చర్ డిస్‍ప్లే, 16జీబీ వేరియంట్ ఆప్షన్‍తో ఈ మ్యాక్‍బుక్ రానుందని తెలుస్తోంది.
(Apple)(3 / 5)
ఐప్యాడ్ 11: ఐప్యాడ్ మోడల్‍కు ఈ ఏడాది కొత్త జనరేషన్ వస్తుందని తెలుస్తోంది. ఐప్యాడ్ 11ను యాపిల్ సిద్ధం చేసిందట. తదుపరి ఈవెంట్‍లో దీన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసిందని సమాచారం బయటికి వచ్చింది. యాపిల్ ఇంటెలిజెన్స్, 8జీబీ ర్యామ్‍తో ఈ ఐప్యాడ్ 11 ఉంటుందని లీకులు బయటికి వచ్చాయి.
(HT Tech)(4 / 5)
ఎం3 ఐప్యాడ్ ఎయిర్: గతేడాదే యాపిల్ ఎం2 ఐప్యాడ్ ఎయిర్ తీసుకొచ్చింది. అయితే, అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఎం3 చిప్‍తో ఐప్యాడ్ ఎయిర్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. తదుపరి ఈవెంట్‍లో ఎం3 ఐప్యాడ్ ఎయిర్ విడుదల చేస్తుందని టాక్.
(HT Tech)(5 / 5)
యాపిల్ వాచ్ ఎస్ఈ 3: చివరగా 2022లో యాపిల్ వాచ్ ఎస్ఈ మోడల్ లాంచ్ అయింది. ఇప్పుడు ఎస్ఈ లైనప్‍లో కొత్త జనరేషన్ వాచ్ తెచ్చేందుకు యాపిల్ రెడీ అవుతోంది. నెక్స్ట్ ఈవెంట్‍లో వాచ్ ఎస్ఈ3ని యాపిల్ విడుదల చేస్తందని తెలుస్తోంది. యాపిల్ వాచ్‍ల్లో ఎస్ఈ మోడల్స్ చవక ధరల్లో ఉంటాయి.
(Apple)ఇతర గ్యాలరీలు