iPhone real or fake: కొత్త ఐఫోన్ కొన్నారా? అది అసలుదా నకిలీదా ఇలా తెలుసుకోండి.. ఏం చూడాలంటే?
iPhone real or fake: ఐఫోన్ కు ఇండియాలోనూ ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. అయితే ఈ క్రేజ్ ను చూసి కొందరు నకిలీ ఐఫోన్లు కూడా అమ్మేస్తున్నారు. మరి మీరు కొన్ని ఐఫోన్ అసలుదా లేక నకిలీదా అన్నది ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి.
(1 / 6)
iPhone real or fake: ప్రతి ఏటా కొత్త ఐఫోన్ మోడల్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కొత్తది మార్కెట్లోకి రాగానే ఆపిల్ లవర్స్ గంటల తరబడి లైన్లలో నిల్చొని మరీ కొనేస్తారు. అయితే ఈ క్రేజ్ ను కొందరు తమకు అనుకూలంగా మలచుకొని నకిలీ ఐఫోన్లను క్రియేట్ చేస్తున్నారు.(AFP)
(2 / 6)
iPhone real or fake: ఐఫోన్లను ఆపిల్ స్టోర్ల నుంచి కొనడం అన్నిరకాలా ఉత్తమం. ఇలా చేస్తే అసలు నకిలీల బారిన పడరు. అయితే ఆథరైజ్డ్ కాని సెంటర్ల నుంచి ఐఫోన్లు కొనే వాళ్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.(HT)
(3 / 6)
iPhone real or fake: నకిలీ ఐఫోన్ల బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒరిజినల్ ఐఫోనేనా కాదా అన్నది తెలుసుకోవడానికి మొదట దాని ప్యాకేజింగ్, అందులోని యాక్సెసరీస్ ను చెక్ చేయాలి. ఐఫోన్ బాక్సులు చాలా మన్నికగా, అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలతో ఉంటాయి. అందులోని కేబుల్స్ లాంటి యాక్సెసరీస్ కూడా ఆపిల్ స్టాండర్డ్స్ కు తగినట్లు ఉంటాయి. ప్యాకేజింగ్ సరిగా లేకపోతే అది నకిలీదే అని చెప్పొచ్చు.(Bloomberg)
(4 / 6)
iPhone real or fake: ఐఫోన్ అసలుదేనా అన్నది తెలుసుకోవడానికి ఆ ఫోన్ సీరియల్ నంబర్, ఐఎంఈఐ నంబర్లను చెక్ చేయండి. Settings > General > About లో ఫోన్ సీరియల్ నంబర్ ఉంటుంది. ఇక #06# కు డయల్ చేస్తే ఐఎంఈఐ నంబర్ తెలుస్తుంది. అవి రెండూ ప్యాకేజీపై, సిమ్ ట్రేపై ఉండే నంబర్లతో సరిపోలుతున్నాయో లేదో చూడండి.(AFP)
(5 / 6)
iPhone real or fake: ఐఫోన్ మొత్తం నిర్మాణం ఎలా ఉందో పరిశీలించింది. ఒరిజినల్ ఐఫోన్ చాలా సాలిడ్ గా ఉంటుంది. బటన్స్ ఎలా పని చేస్తున్నాయో చూడండి. ఆపిల్ లోగో సరైన ప్లేస్ లోనే ఉందా లేదా చెక్ చేయండి. (Apple)
ఇతర గ్యాలరీలు