ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​ ఫీచర్స్​ చూశారా?-iphone 16 pro max to launch soon from specs to features everything we know so far ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​ ఫీచర్స్​ చూశారా?

ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​ ఫీచర్స్​ చూశారా?

Jul 07, 2024, 01:45 PM IST Sharath Chitturi
Jul 07, 2024, 01:45 PM , IST

రాబోయే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కోసం ఎదురుచూస్తున్నారా? స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, తదితర అంశాల పరంగా ఈ స్మార్ట్​ఫోన్​ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2024 సెప్టెంబర్​లో అరంగేట్రం చేయనుంది. ఈ స్మార్ట్​ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా పలు అప్​గ్రేడ్​లను పొందనుందని సమాచారం. రాబోయే యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రోతో పాటు ప్రో మ్యాక్స్ మోడల్​ని లాంచ్ చేయనున్నారు. 

(1 / 5)

యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2024 సెప్టెంబర్​లో అరంగేట్రం చేయనుంది. ఈ స్మార్ట్​ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా పలు అప్​గ్రేడ్​లను పొందనుందని సమాచారం. రాబోయే యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రోతో పాటు ప్రో మ్యాక్స్ మోడల్​ని లాంచ్ చేయనున్నారు. (REUTERS)

నివేదికల ప్రకారం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లే పరిమాణాన్ని కలిగి ఉంటుందని సమాచారం. అయితే, మొత్తం డిజైన్ మునుపటి మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ కొత్త "క్యాప్చర్ బటన్" ఉండనుందని, ఇది వినియోగదారులకు వీడియోలను రికార్డ్ చేయడానికి వీలు కల్పిస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. గత ఏడాది 221 గ్రాముల బరువు ఉండగా ఈ ఏడాది 225 గ్రాములు పెరిగే అవకాశం ఉంది.

(2 / 5)

నివేదికల ప్రకారం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లే పరిమాణాన్ని కలిగి ఉంటుందని సమాచారం. అయితే, మొత్తం డిజైన్ మునుపటి మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ కొత్త "క్యాప్చర్ బటన్" ఉండనుందని, ఇది వినియోగదారులకు వీడియోలను రికార్డ్ చేయడానికి వీలు కల్పిస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. గత ఏడాది 221 గ్రాముల బరువు ఉండగా ఈ ఏడాది 225 గ్రాములు పెరిగే అవకాశం ఉంది.(Apple)

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాసెసింగ్​కి మద్దతు ఇవ్వడానికి అప్​గ్రేడ్​ చేసిన న్యూరల్ ఇంజిన్​తో కొత్త ఏ18 ప్రోతో పనిచేస్తుందని భావిస్తున్నారు. అదనంగా, యాపిల్ పరికరంలో ఓవర్ హీటింగ్​ని తగ్గించడానికి కొత్త థర్మల్ డిజైన్​ పని చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ స్మార్ట్​ఫోన్​ రాబోయే ఐఓఎస్ 18 వెర్షన్​తో పనిచేస్తుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్​ని సపోర్ట్ చేస్తుంది.

(3 / 5)

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాసెసింగ్​కి మద్దతు ఇవ్వడానికి అప్​గ్రేడ్​ చేసిన న్యూరల్ ఇంజిన్​తో కొత్త ఏ18 ప్రోతో పనిచేస్తుందని భావిస్తున్నారు. అదనంగా, యాపిల్ పరికరంలో ఓవర్ హీటింగ్​ని తగ్గించడానికి కొత్త థర్మల్ డిజైన్​ పని చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ స్మార్ట్​ఫోన్​ రాబోయే ఐఓఎస్ 18 వెర్షన్​తో పనిచేస్తుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్​ని సపోర్ట్ చేస్తుంది.(amazon)

కెమెరా అప్​గ్రేడ్స్​ విషయానికి వస్తే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్​లో 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 903 ప్రధాన కెమెరా సెన్సార్, అప్​గ్రేడెడ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 25ఎక్స్ డిజిటల్ జూమ్లను అనుమతించే టెట్రాప్రిజం జూమ్​ని కలిగి ఉండనుంది. ఇందులో సూపర్ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా కూడా ఉండవచ్చు. అయితే, ఈ స్పెసిఫికేషన్లను ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. 

(4 / 5)

కెమెరా అప్​గ్రేడ్స్​ విషయానికి వస్తే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్​లో 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 903 ప్రధాన కెమెరా సెన్సార్, అప్​గ్రేడెడ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 25ఎక్స్ డిజిటల్ జూమ్లను అనుమతించే టెట్రాప్రిజం జూమ్​ని కలిగి ఉండనుంది. ఇందులో సూపర్ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా కూడా ఉండవచ్చు. అయితే, ఈ స్పెసిఫికేషన్లను ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. (Bloomberg)

బ్యాటరీ లైఫ్ పరంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 4676 ఎంఏహెచ్​కు సపోర్ట్​ ఇస్తుంది, ఇది దాని మునుపటి కంటే కొద్దిగా అప్​గ్రేడ్​. రాబోయే ఐఫోన్ 16 సిరీస్​తో వేగవంతమైన 40వాట్ వైర్డ్ ఛార్జింగ్, 20వాట్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్​ను కూడా యాపిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం, ఐఫోన్ 16 ప్రో మోడళ్ల కోసం వినియోగదారులకు 2 టీబీ వరకు స్టోరేజ్ స్పేస్్​ను కూడా అందించాలని యాపిల్ యోచిస్తోంది.

(5 / 5)

బ్యాటరీ లైఫ్ పరంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 4676 ఎంఏహెచ్​కు సపోర్ట్​ ఇస్తుంది, ఇది దాని మునుపటి కంటే కొద్దిగా అప్​గ్రేడ్​. రాబోయే ఐఫోన్ 16 సిరీస్​తో వేగవంతమైన 40వాట్ వైర్డ్ ఛార్జింగ్, 20వాట్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్​ను కూడా యాపిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం, ఐఫోన్ 16 ప్రో మోడళ్ల కోసం వినియోగదారులకు 2 టీబీ వరకు స్టోరేజ్ స్పేస్్​ను కూడా అందించాలని యాపిల్ యోచిస్తోంది.(Bloomberg)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు