(1 / 5)
<p>యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే కొన్ని అప్‍గ్రేడ్‍లతో రానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రోతో పాటే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కూడా లాంచ్ కానుంది. </p>
(REUTERS)(2 / 5)
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ 6.9 ఇంచుల పెద్ద డిస్‍ప్లేతో రానుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో కిందటి మోడల్ కంటే డిస్‍ప్లే పెద్దగా ఉండనుంది. అలాగే, ఈ ఫోన్‍కు ‘క్యాప్చర్ బటన్’ అనే ఓ ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉండనుందని రిపోర్టుల ద్వారా తెలిసింది. యూజర్లు వీడియో రికార్డ్ చేసేందుకు ఈ బటన్ ఉపయోగపడనుంది. ఈ ఏడాది మోడల్ 225 గ్రాముల బరువు ఉండొచ్చు. గత మోడల్ కంటే ఇది నాలుగు గ్రాములు ఎక్కువ.
(Apple)(3 / 5)
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ సరికొత్త ఏ18ప్రో బయోనిక్ ప్రాసెసర్‌తో రానుందని తెలుస్తోంది. ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేసేలా అప్‍గ్రేడెడ్ న్యూరల్ ఇంజిన్‍తో ఈ చిప్‍సెట్ ఉండనుంది. మొబైల్ ఓవర్ హీట్ కాకుండా కొత్త థర్మల్ డిజైన్‍పై కూడా యాపిల్ పని చేసినట్టు తెలుస్తోంది. ఏఐ ఫీచర్లు ఉండే ఐఓఎస్ 18తో ఐఫోన్ 16 సిరీస్ రానుంది.
(amazon)(4 / 5)
కెమెరా అప్‍గ్రేడ్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్903 మెయిన్ కెమెరా, అప్‍గ్రేడెడ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో రానుందని అంచనా. 5x ఆప్టికల్ డూమ్, 25x డిజిటల్ జూమ్ సదుపాయాలు ఇచ్చే టెట్రాపిమ్ జూమ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది.
(Bloomberg)(5 / 5)
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ 4676 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని రిపోర్టులు బయటికి వచ్చాయి. గత మోడల్ కంటే ఇది కాస్త అప్‍గ్రేడ్‍గా ఉంది. అలాగే, 40 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ మ్యాక్‍సేఫ్ వైర్లెస్ చార్జింగ్‍కు ఈ ఫ్లాగ్‍షిప్ మొబైల్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో 2టీబీ వేరియంట్ కూడా తెచ్చేందుకు యాపిల్ ప్లాన్ చేసింది.
(Bloomberg)ఇతర గ్యాలరీలు