iPhone 16 Prices In India : భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?-iphone 16 prices in india apple ai powered iphone 16 plus iphone 16 pro iphone 16 pro max rate when you can order ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone 16 Prices In India : భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

iPhone 16 Prices In India : భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

Sep 10, 2024, 09:43 AM IST Anand Sai
Sep 10, 2024, 09:43 AM , IST

  • iPhone 16 Prices In India : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఈ నాలుగు ఫోన్లు వచ్చాయి. కొత్త ఐఫోన్‌ ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. అయితే ఇండియాలో ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఓ లుక్కేయండి.

ఐఫోన్ అభిమానులు 16 సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 'పవర్'తో ఆపిల్ ఐఫోన్ 16ను ఆవిష్కరించింది. 'నెక్ట్స్ జనరేషన్' ఐఫోన్ తొలి గ్లింప్స్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ మాట్లాడుతూ.. 'కొత్త శకం ప్రారంభమైంది' అన్నారు.

(1 / 5)

వచ్చే నెల నుంచి ఆపిల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వెర్షన్ అమెరికాలో మాట్లాడే ఇంగ్లిష్ భాషలో అందుబాటులోకి రానుంది. వచ్చే డిసెంబర్‌లో స్థానిక ఇంగ్లిష్‌లో అందుబాటులోకి రానుంది. 2025లో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

(2 / 5)

ఇక ఐఫోన్ విషయానికొస్తే ఫోన్ వేడెక్కుతుందని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో ఆపిల్ దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు చర్యలు చేపట్టింది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లలో కూడా అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఛాంబర్ ఉంది. ఫలితంగా ఫోన్ మరీ వేడిగా ఉండదు.

(3 / 5)

ఇండియాలో ఐఫోన్ల ధర ఎంతంటే? ఐఫోన్ 16 (128 జీబీ) ధర రూ.79,900 నుంచి ప్రారంభమౌతోంది. ఐఫోన్ 16 ప్లస్ (128 జీబీ) ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఐఫోన్ 16 ప్రో (128 జీబీ) ధర రూ.1,19,000 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 16 ప్రో (మ్యాక్స్ 256 జీబీ) ధర రూ.1,44,900 నుంచి ప్రారంభం కానుంది.

(4 / 5)

భారతదేశంలో కొత్త ఐఫోన్లు సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి వస్తుందని ఆపిల్ తెలిపింది. భారత్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో సెప్టెంబర్ 13న (శుక్రవారం) ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటాయని ఆపిల్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు