
(1 / 7)
చాలా మంది మహిళలకు ఋతుస్రావం సమయంలో సెక్స్ చేయడం సురక్షితం కాదని వారు భావిస్తారు, అయితే ఇది నిజంగా నిజమేనా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి.

(2 / 7)
నెలసరి సమయంలో సెక్స్ చేయడం వల్ల పురుషులు నపుంసకులు అవుతారని కొందరు నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.

(3 / 7)
పీరియడ్స్ లో సెక్స్ చేయడం వలన ఆడవారికైనా, మగవారికైనా కొంత అసౌకర్యం ఉంటుంది. అయితే పొరపాటున చేసినా కూడా ఎలాంటి హానీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

(4 / 7)
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వలన దాదాపు గర్భం రాదు, కానీ అరుదైన సందర్భాల్లో వస్తుంది.

(5 / 7)
పీరియడ్స్ సమయంలో రక్షణ లేకుండా సెక్స్ చేస్తే, లైంగిక అంటు వ్యాధుల బారిన పడవచ్చు. అయితే, సాధారణ రోజుల్లో లైంగిక సంక్రమణలకు అవకాశం ఉంది.

(6 / 7)
అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వల్ల ఆడవారికి కొన్ని సందర్భాల్లో మేలు జరిగే అవకాశమూ లేకపోలేదు. వారు ఉద్రేకానికి లోనయినపుడు గర్భాశయ కండరాలు కూడా సంకోచం చెందుతాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇది వారికి నెలసరి నొప్పి నుండి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

(7 / 7)
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం కంటే కూడా వారితో సన్నిహితంగా మెలుగుతూ, తగిన విశ్రాంతినివ్వడం హాయిగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు