(1 / 5)
రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు కొరియా మొత్తాన్ని జపాన్ పాలించేది. ఆ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో యూఎస్ఎస్ఆర్, అమెరికాలు కొరియాపై కన్నేశాయి.
(2 / 5)
నార్త్ భాగంలో యూఎస్ఎస్ఆర్ చురుకుగా ఉండగా. సౌత్ భాగాన్ని అమెరికా చూసుకునేది. అయితే, అడ్మినిస్ట్రేషన్ విషయంలో రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి. ఫలితంగా నార్త్ కొరియా, సౌత్ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి.
(3 / 5)
కొరియా ద్వీపానికి దక్షిణ భాగాన్ని సైగ్మన్ రీకి అమెరికా ఇచ్చింది. అలా ఆయన సౌత్ కొరియాకు మొదటి అధ్యక్షుడు అయ్యారు.
(4 / 5)
ఇక నార్త్ కొరియాను కిమ్ 2 సుంగ్ చేతుల్లో పెట్టింది సోవియట్ యూనియన్. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో యూఎస్ఎస్ఆర్ తరపున పోరాడారు. అలా కిమ్ కుటుంబం చేతుల్లోకి నార్త్ కొరియా వెళ్లింది.
(5 / 5)
1950లో సౌత్ కొరియాపై కిమ్ 2 సుంగ్ యుద్ధం చేశారు. కొరియా మొత్తాన్ని కలిపేందుకు విఫలయత్నం చేశారు. కిమ్ మరణం తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ నార్త్ కొరియాను పాలించారు. ఆయన మరణం తర్వాత కిమ్ జోంగ్ ఉన్కి అధికారులు వచ్చాయి.
(AFP)ఇతర గ్యాలరీలు