(1 / 6)
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23న హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ఉంటాయి. 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
(2 / 6)
ఉప్పల్ స్టేడియం పేరు.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. 2003లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇది హైదరాబాద్ తూర్పు శివారులో ఉన్న ఉప్పల్‌లో ఉంది. ఈ స్టేడియం 16 ఎకరాల్లో విస్తరించి ఉంది.
(3 / 6)
ఉప్పల్ స్టేడియంలో దాదాపు 55,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హోమ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది.
(4 / 6)
ఉప్పల్ స్టేడియంలోని పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. స్టేడియంలో కార్పొరేట్ బాక్స్‌లు, ముఖ్యమంత్రి బాక్స్, వైఫైతో కూడిన విశాలమైన మీడియా గది ఉన్నాయి.
(5 / 6)
ఉప్పల్ స్టేడియం అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ ఉన్నాయి. ఈ స్టేడియం 2017, 2019 ఐపీఎల్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు