Antarvedi: అంతర్వేది.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రాంతం.. మీరూ ప్లాన్ చేసుకొండి..
- Antarvedi: అంతర్వేది.. ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి వెళ్లాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఇక్కడ అత్యంత పవిత్రమైన గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగే సముద్ర తీరాన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.
- Antarvedi: అంతర్వేది.. ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి వెళ్లాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఇక్కడ అత్యంత పవిత్రమైన గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగే సముద్ర తీరాన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.
(1 / 6)
అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. కేవలం ఏపీ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఆలయానికి చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. అవే కాకుండా ప్రైవేటు హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో బస చేస్తే.. అంతర్వేది అందాలను ఆస్వాదించవచ్చు.(Wikipedia )
(2 / 6)
అంతర్వేదిలో అన్నచెల్లెల్ల గట్టు చాలా ఫేమస్. సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా విశ్వస్తారు. సముద్రంలో వశిష్ట నది కలిసే చోటును అన్నా చెల్లెల్ల గట్టు అంటారు. ఇక్కడ సముద్రం, నది కలిసే చోట కొంత భాగం ఇసుకతో గట్టులాగా ఉంటుంది. ఇక్కడ రెండు రకాల నీటిని చూడొచ్చు. సముద్రం వైపు ఇసుక, మట్టితో నీరు కనిపిస్తుంది. వశిష్ట నది వైపు తేటగా స్వచ్ఛమైన నీరు కనిపిస్తుంది.
(3 / 6)
అంతర్వేది పక్కనే ప్రవహించే వశిష్ట గోదావరి అందాలను చూడాలంటే బోటులో వెళ్లొచ్చు. గోదావరి అలలు.. గట్టు పక్కన కొబ్బరి చెట్లు.. మరోవైపు సముద్రం.. ఆ అందాలను మాటల్లో వర్ణించలేం. అందుకే వీలు దొరికినప్పుడల్లా చాలామంది అంతర్వేది వస్తుంటారు.
(4 / 6)
అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. కేవలం ఏపీ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఆలయానికి చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. అవే కాకుండా ప్రైవేటు హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో బస చేస్తే.. అంతర్వేది అందాలను ఆస్వాదించవచ్చు.
(5 / 6)
అంతర్వేది రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్లైట్ ద్వారా వస్తే.. రాజమండ్రి నుంచి రావొచ్చు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్‌లో రావాలనుకుంటే.. నరసాపురం, పాలకొల్లు స్టేషన్లు దగ్గర్లో ఉంటాయి. అంతర్వేది నుంచి 25 కిలో మీటర్ల దూరంలోనే పాలకొల్లు, నరసాపురం రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు