Telangana Tourism : అద్భుతం.... ఆకర్షణీయం..! తెలంగాణలోని 'పాండవుల గుట్టల' గురించి తెలుసా..-interesting facts about pandavula guttalu in jayashankar bhupalapalli district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : అద్భుతం.... ఆకర్షణీయం..! తెలంగాణలోని 'పాండవుల గుట్టల' గురించి తెలుసా..

Telangana Tourism : అద్భుతం.... ఆకర్షణీయం..! తెలంగాణలోని 'పాండవుల గుట్టల' గురించి తెలుసా..

Jan 29, 2025, 02:07 PM IST Maheshwaram Mahendra Chary
Jan 29, 2025, 02:07 PM , IST

  • Pandavula Guttalu in Telangana : భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్టల్లో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు ఎంతోగానో ఆకర్షిస్తాయి.ప్రాచీనమైన వర్ణ చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ గుట్టలకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తింపు కూడా ఉంది. విశేషాలు ఇక్కడ చూడండి..

పాండువుల గుట్టలు....సహజ సిద్ధంగా కనిపిస్తాయి...! ఇక్కడి విశేషాలను మాటల్లో వర్ణించలేం అన్నట్లు ఉంటాయి. ఈ గుట్టల్లో అబ్బురపరిచే గుహలు, ప్రాచీనమైన వర్ణ చిత్రాలు కూడా దాగి ఉన్నాయి.

(1 / 8)

ఈ పాండవుల గుట్టలు... జయశంకర్  భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 22  కి.మీ. దూరంలో నెలకొని ఉన్నాయి. వరంగల్ –   మహదేవపూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవుల గుట్టలుంటాయి. సున్నపురాళ్ళతో, అవక్షేప శిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు దర్శనిమిస్తాయి. 

(2 / 8)

 ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన  లోయలు, గుహలు కనిపిస్తాయి. అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు ఉంటాయి. ఈ కొండ గోడలపై అపురూపమైన ప్రాచీన రాతి చిత్రాలు కనిపిస్తాయి.  

(3 / 8)

ప్రాక్ యుగం నుంచి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలెన్నో ఇక్కడ చూడొచ్చు. అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని ప్రతిబింబిస్తాయి.ఇక్కడ ఉన్న మంచి నీటి గుహలో  చల్లని నీరు దొరుకుతుంది. వర్షా కాలంలో గుట్టలపైనుంచి పలుచోట్ల జలపాతాలు జాలువారుతాయి. వీక్షించేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో తరలివస్తారు. 

(4 / 8)

 పర్యాటకులు సందర్శించడానికి మంచి టూరిస్ట్ ప్లేస్ గా పాండవుల గుట్టను చెప్పొచ్చు. అంతేకాదు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసే వీలు ఉంది. పాండవుల గుట్టలోని ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటిగా ఉంది. 

(5 / 8)

ఈ పాండవుల గట్టు ప్రాంతాన్ని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అతి ప్రాచీన ప్రాంతంగా కూడా గుర్తించింది. ఈ ప్రాంతంలో జియో టూరిజం అభివృద్ధికి చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా నిధులు అందనున్నాయి.

(6 / 8)

పాండవుల గుట్టలు దాదాపు 7 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దీనికి కోట గోడ ముఖద్వారం కూడా ఉంటుంది. అక్కడక్కడ రాతి కట్టడాలున్నాయి. ఇక్కడి వర్ణచిత్రాలు శిలాయుగం నాటివని పురావస్తు శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని 1990లో పురావస్తుశాఖ వెలుగులోకి తెచ్చింది.

(7 / 8)

హైదరాబాద్ నుంచి  పాండవుల గుట్ట ప్రాంతం 200 కిమీ దూరంలో ఉంటుంది. అదే వరంగల్ సిటీ నుంచి కేవలం 50 కి.మీ మాత్రమే ఉంటుంది.  రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 'పాండవుల గుట్ట'ని సందర్శించడానికి ఉత్తమ సీజన్ అని స్థానికులు చెబుతున్నారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు