Maredumilli Tourism : ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి అందాలు..! 'గుడిస' టూరిస్ట్ స్పాట్ చూడాల్సిందే..!
- Maredumilli Gudisa Hill Station Tourism : ఎత్తైన కొండల్లో రాత్రంతా స్టే చేయటమే కాదు ఉదయం వేళ ప్రకృతి అందాలు వీక్షించవచ్చు. ఇలాంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కు పెట్టింది పేరు మారేడుమిల్లి. ఇక్కడి ప్రకృతి అందాలను ఒక్క మాటలో వర్ణించలేం.
- Maredumilli Gudisa Hill Station Tourism : ఎత్తైన కొండల్లో రాత్రంతా స్టే చేయటమే కాదు ఉదయం వేళ ప్రకృతి అందాలు వీక్షించవచ్చు. ఇలాంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కు పెట్టింది పేరు మారేడుమిల్లి. ఇక్కడి ప్రకృతి అందాలను ఒక్క మాటలో వర్ణించలేం.
(1 / 10)
ఎత్తైన కొండలు, అందులోనూ ఘాట్ రోడ్లు, ఎటు చూసిన పచ్చని ప్రకృతి అందాలు… వీటన్నింటిని ఒకే ఫ్రేమ్ లో చూడాలంటే ఏపీలోని మారేడుమిల్లికి వెళ్లాల్సిందే.
(image source HT Telugu)(2 / 10)
ఏపీలోని అల్లూరి సీతరామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతం ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. దట్టంగా కనిపించే ఈ ప్లేస్ ఎకో టూరిజం హబ్‌గా, పర్యాటకులకు వీకెండ్ గేట్వేగా చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.
(image source HT Telugu)(3 / 10)
హైదరాబాద్ నుంచి దాదాపు 430 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 200 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 80 కి,మీటర్లకు పైగా ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది.
(image source HT Telugu)(4 / 10)
మారేడుమిల్లికి వెళ్తే చూడాల్సిన ప్రాంతం… గుడిస హిల్ స్టేషన్. చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యలోనే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాకపోకలు ఉండవు.
(image source HT Telugu)(5 / 10)
ఈ గుడిస హిల్ స్టేషన్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మారేడుమిల్లి నుంచి ఇక్కడికి వెళ్లాలంటే మీ సొంత వాహనాల్లో కాకుండా… అక్కడ అద్దెకు దొరికే జీపులను ఎంచుకోవటం బెటర్ ఆప్షన్. ఈ జర్నీ 40 కి.మీ వరకు ఉంటుంది.
(image source HT Telugu)(6 / 10)
గుడిసకు వెళ్లే జర్నీ అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో ఎత్తైన కొండపై మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. గుడిస దగ్గర చూడాల్సిన మరో అద్భుతం సూర్యోదయం అని చెప్పొచ్చు. సూర్యోదయాన్ని అత్యంత దగ్గరగా చూశామనే అనుభూతి కలుగుతుంది.
(image source HT Telugu)(7 / 10)
గుడిస వద్ద నుంచి చూస్తే మేఘాలన్నీ కొండలను తాకినట్లు కనిపిస్తాయి. పైన విశాలమైన మైదనపు ప్రాంతాలు కనిపిస్తాయి. హిల్ స్టేషన్ నుంచి కనిపించే ప్రకృతి అందాలను మాటాల్లో వర్ణించలేం.
(image source HT Telugu)(8 / 10)
ఇక్కడ ఉదయం 5 దాటితే చాలు… చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. సూర్యోదయాన్ని వీక్షించిన తర్వాత… తిరిగి కిందికి వెళ్తారు.
(image source HT Telugu)(9 / 10)
గుడిసకు వచ్చే వారు మారేడుమిల్లి అడవుల్లో నైట్ క్యాంప్ కూడా వేయవచ్చు. ఇందుకోసం పలు ప్రైవేట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో వాహన వసతి, భోజనం, ఫైర్ క్యాంప్ వంటి వాటిని ఏర్పాటు చేస్తారు.
(image source HT Telugu)ఇతర గ్యాలరీలు