సామి శిఖరం.. చెట్లు ఏం చేయలేవు- విరాట్​ కోహ్లీ ది గ్రేట్​!-inspiring lines about virat kohli rcb after ipl 2025 victory ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సామి శిఖరం.. చెట్లు ఏం చేయలేవు- విరాట్​ కోహ్లీ ది గ్రేట్​!

సామి శిఖరం.. చెట్లు ఏం చేయలేవు- విరాట్​ కోహ్లీ ది గ్రేట్​!

Published Jun 04, 2025 06:23 AM IST Sharath Chitturi
Published Jun 04, 2025 06:23 AM IST

తిట్టారు.. విమర్శించారు.. కెప్టెన్సీ రాదన్నారు.. ట్రోల్​ చేశారు.. టీమ్​ని వదిలేయాలని ప్రాథేయ పడ్డారు.. కానీ అతను మాత్రం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును విడిచిపెట్టలేదు. 18ఏళ్లు పోరాడాడు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. చివరికి సక్సెస్​ చూశాడు. అందుకే ఈ గెలుపు విరాట్​ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం!

ఆర్సీబీతో కోహ్లీ ప్రస్థానం కెప్టెన్సీకి, ప్లేయర్​కి మించినది. ఆర్సీబీ గుండెచప్పుడు విరాట్​ కోహ్లీ. ఈ టీమ్​కి తన యవ్వనాన్ని ఇచ్చాడు, ప్రైమ్​ టైమ్​ని ఇచ్చాడు. ఎక్స్​పీరియెన్స్​ని ఇచ్చాడు. సంతోషాలు చూశాడు- హార్ట్​బ్రేక్​లు అనుభవించాడు. ఏం జరిగినా ధైర్యంగా నిలబడ్డాడు. లాయల్​గా ఉన్నాడు.

(1 / 5)

(Surjeet Yadav)

నెంబర్​ 18 జెర్సీ ధరించి.. ప్రతిసారి గర్జించాడు, బ్యాటర్​గా, ఫీల్డర్​గా, కెప్టెన్​గా.. ఆర్సీబీని భుజాల మీద మోశాడు. గెలుపు కోసం పరితపించాడు. ఓటమితో పోరాటం చేశాడు. చివరికి కప్​ గెలిచిన తర్వాత చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు.

(2 / 5)

బ్రేకప్​లు, చీటింగ్​లు మితిమీరిపోతున్న నేటి కాలంలో లాయల్టీకి అసలు సిసలైన అర్థం చెప్పాడు విరాట్​ కోహ్లీ. “దిస్​ టీమ్​ డోంట్​ డిజర్వ్​ కోహ్లీ” అని లక్షల మంది అభిప్రాయపడిన సందర్భాలు ఎన్నో! కోహ్లీ తలచుకుంటే ఫ్రాంచైజ్​ని వదిలేయడం క్షణాల్లో పని. కానీ వదల్లేదు. 18ఏళ్ల పాటు ఒకే టీమ్​కి ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కప్​తో పాటు మనసులు గెలిచాడు.

(3 / 5)

ఈ 18ఏళ్ల జర్నీలో కోహ్లీ చూడనిది అంటూ ఏదీ లేదు. సెంచరీలు చేశాడు, ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు. ఎన్నో ఓటములు చూశాడు. ఏం జరిగినా.. కళ్లల్లో ఆ ఫైర్​, జట్టుకు ఏదైనా చేయాలన్న కసితో ప్రతిసారి బరిలో దిగాడు.

(4 / 5)

(REUTERS)

ఆర్సీబీ అండ్​ విరాట్​ కోహ్లీ ప్రస్తానం నుంచి ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి. సక్సెస్​కి టైమ్​ పడుతుంది! అప్పటివరకు మనం ఓపికగా ఉండాలి. ఈ జర్నీలో ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. ఎన్నో హార్ట్​బ్రేక్​లు ఉంటాయి. అన్ని చూసిన తర్వాతే సక్సెస్​కి నిజమైన అర్థం తెలుస్తుంది.

(5 / 5)

(PTI)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు