Infinix GT 10 Pro: అడ్వాన్స్డ్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రొ; ఫ్లిప్ కార్ట్ లో సేల్
స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడడం మీ సరదానా? మీ కోసమే ప్రత్యేకంగా రూపొందిన స్మార్ట్ ఫోన్ ఇది.ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ (Infinix GT 10 Pro) స్మార్ట్ ఫోన్ సేల్ ఆగస్ట్ 10వ తేదీన ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. ఈ లేెటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవిగో..
(1 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ రెండు రంగుల్లో లభిస్తుంది. అవి సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్. ఎల్ఈడీ బ్యాక్ లైట్ ఇంటర్ ఫేస్ ఈ స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీ.(HT Tech)
(2 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో 6.67 ఇంచ్ ల 10 బిట్ ఎఫ్ హెచ్ డీ ప్లస్ ఐ కేర్ అమొలెడ్ డిస్ ప్లే ఉంటుంది. (HT Tech)
(3 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక డైమెన్సిటీ 8050 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ తో లభిస్తుంది. గేమర్స్ ఫేవరెట్ అయిన ఈ ఫోన్ హీట్ కాకుండా ప్రత్యేకంగా 11 లేయర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. (HT Tech)
(4 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్, 360 హెర్జ్స్ టచ్ సాంప్లింగ్ రేట్ డిస్ ప్లే ఉంది. అంతేకాదు, ఇందులో 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
(5 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో 15 ప్రి ఇన్ స్టాల్డ్ గూగుల్ యాప్స్, 50 ప్రి ఇన్ స్టాల్డ్ ఓఎస్ క్లీనింగ్ యాప్స్, 13 ప్రి ఇన్ స్టాల్డ్ హై యుటిలిటీ యాప్స్ ఉన్నాయి.(HT Tech)
(6 / 7)
Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో వైఫై 6, డ్యుయల్ 5 జీ సిమ్, ఏఐ ఫిల్మ్ మోడ్, కెమెరా ఆటో ఫోకస్ టెక్నాలజీ వంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. (HT Tech)
ఇతర గ్యాలరీలు