(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి. . మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 562 గ్రామాల్లో 70,122 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 47 వేల మందికిపైగా లబ్ధిదారులకు అనుమతులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందించారు.
(2 / 8)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రోసిడింగ్స్ అందుకున్న వారిలో ఇప్పటివరకు 17 వేల మందికిపైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకున్నారు. వీరిలోనూ ఆరు వేల మందికిపైగా లబ్ధిదారులు పునాది వరకు పూర్తి చేసుకున్నారు.
(3 / 8)
బేస్ మెంట్ నుంచి ఇంటి నిర్మాణం పూర్తి వరకు దశల వారీగా ప్రభుత్వం డబ్బులను జమ చేయనుంది. పునాది వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసిన పలువురి ఖాతాల్లోనూ ఇప్పటికే ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. దీనికి ప్రతి సోమవారం గడువుగా నిర్ణయించింది. పనుల పురోగతి ఆధారంగా వీటిని క్రెడిట్ చేస్తోంది. ఈ స్కీమ్ లో లబ్ధిదారుడికి మొత్తం రూ. 5 లక్షలు అందుతాయి.
(4 / 8)
ఇంటి పునాది పూర్తి కాగానే లబ్ధిదారుడి ఖాతాలో ఒక లక్ష రూపాయలు జమవుతాయి. ప్రతి సోమవారం ఈ బిల్లులను జమ చేస్తారు. వివరాల సేకరణ దశల వారీగా ఉంటుంది. ముందుగా గ్రామ కార్యదర్శి దశలో వివరాలను సేకరించి…. ఏఈ, ఆపై డీఈకి చేర్చుస్తారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వద్దకు చేరిన తర్వాత…… జిల్లా కలెక్టర్ అప్రూవల్ చేస్తారు. అక్కడ్నుంచి హౌసింగ్ కార్పొరేషన్‌కు వివరాలు చేరుతాయి.
(5 / 8)
క్షేత్రస్థాయి నుంచి హౌసింగ్ కార్పొరేషన్ లాగిన్ లోకి వివరాలు రాగానే… వాటిని పరిశీలించి లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులను జమ చేస్తారు. పనుల పురోగతి వివరాలను యాప్ ద్వారా ఎంట్రీ చేయటమే కాకుండా… ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంటారు.
(6 / 8)
మరోవైపు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇందిరమ్మ ఇళ్లను కచ్చితంగా 400-600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించుకోవాలని సూచించింది. నిర్ణయించిన చదరపు అడుగులు దాటితే… బిల్లులు రావని స్పష్టం చేసింది.
(7 / 8)
పాత ఇంటికి మరమ్మత్తు చేసి నిర్మాణం చేసుకుంటే కూడా స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. ప్రోసిడింగ్స్ అందుకున్న వారు… తప్పనిసరిగా ఖాళీ జాగలో కొత్తగా ఇంటి నిర్మాణం చేయాలి. లబ్ధిదారులు ఆ స్థలం వద్ద ఫొటోలు కూడా దిగాల్సి ఉంటుంది. ఎవరైనా అనర్హులు ఉంటే… స్కీమ్ మధ్యలో కూడా తొలగిస్తారు. డబ్బులు జమ చేస్తే కూడా వెనక్కి తీసుకుంటారు.
(8 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ http://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 040-29390057 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి కూడా పలు సేవలు పొందే వీలు ఉంటుంది.
ఇతర గ్యాలరీలు