TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - 3 జాబితాలుగా అప్లికేషన్లు...! వీరికే తొలి ప్రాధాన్యం
- TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. ఎల్ 1, 2, 3 విభాగాలుగా విభజించి… ప్రాధ్యానత ప్రకారం లబ్ధిదారులను ఖరారు చేస్తున్నారు. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….
- TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. ఎల్ 1, 2, 3 విభాగాలుగా విభజించి… ప్రాధ్యానత ప్రకారం లబ్ధిదారులను ఖరారు చేస్తున్నారు. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….
(1 / 7)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులను మూడు కేటగిరిలుగా విభజిస్తున్నారు. వీటి ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
(2 / 7)
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా తాజాగా నిర్వహించిన గ్రామ సభల్లో కూడా మరికొన్ని అప్లికేషన్లు వచ్చాయి. వీటిని కూడా పరిశీలించి అధికారులు ఆన్ లైన్ చేసే పనిలో ఉన్నారు.
(3 / 7)
లక్షలాది సంఖ్యలో దరఖాస్తులు రావటంతో అర్హుల ఎంపిక ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఈ క్రమంలోనే…. దరఖాస్తులను మూడు జాబితాలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచున్నారు.ఇక ఎల్ 2 లో స్థలం, ఇల్లు రెండూ లేనివాళ్ల పేర్లను చేరుస్తున్నారు. ఎల్ 3లో అద్దె ఇంట్లో ఉన్నవారు, రేకుల షెడ్, పెంకుటిండ్లలో ఉన్నవారి పేర్లను ఎక్కిస్తున్నారు.
(4 / 7)
ఇక మొదటి దశలో సొంత జాగ ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెండో దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే… ఎల్ 1 జాబితాలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.
(5 / 7)
ఈ స్కీమ్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు…. ఎల్-1లో 21.93 లక్షలు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులను ఎంట్రీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా పరిశీలన కొనసాగుతోంది.
(6 / 7)
తొలి విడతలో 562 గ్రామాల నుంచి 71 వేల మందికిపైగా అర్హులను గుర్తించి… లబ్ధిదారులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులోనూ అత్యధికంగా ఎల్-1 నుంచి 59 వేలకుగా మందిని ఖరారు చేసింది.
ఇతర గ్యాలరీలు